
ఒక్క రోజు దేవత అయితే...?
ప్రగ్యా జైస్వాల్‌ని చూస్తే నయనానందం... ఆమె పలుకులు శ్రవణా నందం... అడిగిన ప్రశ్నలకు కాదనకుండా సమాధానం చెబితే అమితానందం... చదివే వారి మనసుకు ఆనందం. ఏంటీ.. ‘నమో వేంకటేశాయ’లో ‘ఆనందం.. ఎంతో ఆనందం..’ పాట గుర్తొ స్తోందా? ఆ పాటలో ప్రగ్యా హావభావాలు సూపర్ కదూ. ఇక్కడ కొన్ని ప్రశ్నలకు ఈ బ్యూటీ ఇచ్చిన సమాధానాలు కూడా సూపరే.
సెలబ్రిటీ అయ్యారు కదా.. ఏం నేర్చుకున్నారు?
సహనంగా ఉండాలి. అందరితో కలిసిపోవాలి.
హీరోయిన్ కాకపోయి ఉంటే ఏం చేసేవారు?
లా చదివాను. తప్పకుండా లాయర్ అయ్యుండేదాన్ని.
ఫస్ట్ డే షూటింగ్ ఎలా అనిపించింది?
మొదట చాలా భయం వేసింది. ఫైనల్లీ హ్యాపీ.
మీ గోల్ ఏంటి?
ప్రపంచాన్ని శాసించడం (సరదాగా అన్నానండి బాబు). పెద్ద పెద్ద లక్ష్యాలేవీ లేవు.
ఒకే ఒక్క రోజు దేవత అయ్యే అవకాశం వస్తే ఏం చేస్తారు?
పేదరికాన్ని నిర్మూలిస్తాను. ప్రపంచం మొత్తం శాంతి ఉండేలా చేస్తాను. క్రైమ్‌ను తొలగిస్తాను. అందరూ సమానత్వంగా బతికేలా చేస్తా. జవాబుదారీతనం ఉండేలా చేస్తాను.
మీరు డేట్ చేయడానికి ఏ టాలీవుడ్ హీరోని కోరుకుంటున్నారు?
ఏ హీరోతోనూ డేట్ చేయాలని నేను అనుకోవడం లేదు. అందరూ నాకు మంచి స్నేహితులే. ‘ఐ నీడ్ ఎ నార్మల్ బాయ్ టు డేట్’. అంతే.
పెళ్లెప్పుడు చేసుకుంటారు? ఎలాంటి లక్షణాలున్న అబ్బాయి కావాలి?
ఇప్పట్లో వివాహం చేసుకోకూడదను కుంటున్నాను. అందుకని కాబోయే భర్త గురించి ఏమీ ఆలోచించలేదు. అడిగారు కాబట్టి ఇప్పటికిప్పుడు ఆలోచించుకుని చెబుతున్నా. అతను నిజాయితీగా ఉండాలి. అబద్ధం చెప్పకూడదు. మంచి ఎత్తు ఉండాలి. ముఖ్యంగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఉండాలి. ఇంకా బోల్డంత లిస్ట్ ఉంది.
ప్రపంచంలో మీ ఫెవరట్ వ్యక్తి?
మా నాన్న.
మహేశ్ గురించి ఒక్క మాటలో?
సూపర్ డూపర్ హ్యాండ్‌సమ్.
రామ్‌చరణ్ గురించి?
బాగా డ్యాన్స్ చేస్తాడు. అద్భుతమైన యాక్టర్.
మీ బ్యూటీ సీక్రెట్?
ఈ విషయంలో మా అమ్మనాన్నలకు థ్యాంక్స్ చెప్పాలి. నో సీక్రెట్.
ఫైనలీ.. అమ్మాయిలకు ఏదైనా మెసేజ్ ఇస్తారా?
మహిళలందరూ మార్షల్ ఆర్ట్స్‌తోపాటు కొన్ని ఢిపెన్స్ టెక్నిక్స్ నేర్చుకోవడం మంచిది. ఈ రోజుల్లో తప్పక అవసరం అనిపిస్తోంది. ఎవరో వస్తారు.. కాపాడతారు అని ఎదురు చూసే బదులు మనల్ని మనమే కాపాడు కోవాలి. అంత స్ట్రాంగ్‌గా ఉండాలి.