
నటి స్మైలీ సూరీ (పాత చిత్రం పక్కనే తాజా చిత్రం)
సాక్షి, సినిమా : ప్రముఖ దర్శక నిర్మాత మహేష్ భట్‌కు బంధువు. పైగా దర్శకుడు మోహిత్ సూరికి స్వయానా సోదరి. హీరోయిన్‌గా ఒక్క చిత్రంతోనే క్రేజ్‌ను సంపాదించుకుంది. ఆమె స్మైలీ సూరీ. ఇప్పుడు అనారోగ్య కారణాలతో బాలీవుడ్ మీడియాలో ఆమె హాట్ టాపిక్‌గా మారిపోయింది.
స్మైలీ సూరీ(34) 2005లో కల్‌యుగ్ చిత్రం ద్వారా బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. ఖునాల్ ఖేము పక్కన అమాయకపు పాత్రలో నటించిన స్మైలీకి మంచి మార్కులు పడ్డాయి. అయితే సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చి కూడా ఆమె తర్వాత ఎందుకనో సినిమాల్లో కొనసాగలేకపోయింది. మధ్యలో నాలుగైదు చిత్రాల్లో గెస్ట్ రోల్స్‌తోనే ఆమె సరిపెట్టింది. 2014లో డాన్సర్ వినీత్ బంగేరాను వివాహం చేసేసుకున్న ఆమె రియాల్టీ షో నాచ్ బలీయే-7లో పాల్గొంది కూడా.
అయితే ఆ తర్వాతే ఆమెకు సమస్యలు ప్రారంభమయ్యాయి. థైరాయిడ్ కారణంగా ఆమె విపరీతమైన బరువు పెరిగిపోయి గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. దీనికితోడు పీసీఓడీ తో కూడా ఆమె బాధపడుతున్నారంట. అనారోగ్యంతో ఆమె తీవ్రమైన ఒత్తిడికి లోనై డిప్రెషన్‌లోకి వెళ్లిపోయింది. ప్రస్తుతం ఆ పరిస్థితి నుంచి బయటపడేందుకు చికిత్సతోపాటు డాన్స్‌ను కూడా ఆమె నమ్ముకున్నారు. ఇప్పుడు ఆమె పోల్ డాన్సర్ అవతారంలోకి మారిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment