పెళ్లి కుదిరింది | Actress Tashu Kaushik gets engaged | Sakshi
Sakshi News home page

పెళ్లి కుదిరింది

Published Sat, Jan 10 2015 12:00 AM | Last Updated on Sat, Sep 2 2017 7:27 PM

పెళ్లి కుదిరింది

పెళ్లి కుదిరింది

రాజు-మహరాజు, దుశ్శాసన, వైకుంఠపాళి, తెలుగబ్బాయి తదితర చిత్రాల్లో నటించిన కథానాయిక తషు కౌశిక్ ఇక సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నారు. అందుకు కారణం - ఆమెకు పెళ్లి నిశ్చయమైంది. స్కూల్‌లో తనతో కలిసి చదువుకున్న దేవంగ్ రాజ్ తయాల్‌ని ఆమె పెళ్లాడనున్నారు. ఈ నెల 4న కాన్పూర్‌లో కుటుంబ సభ్యుల సమక్షంలో తషు, దేవంగ్‌ల నిశ్చితార్థం జరిగింది. రాజస్తాన్‌లోని హెరిటేజ్ ప్యాలెస్‌లో వివాహ వేడుక జరగనుంది. ఇంకా తేదీ ఖరారు కాలేదు.  

ప్రస్తుతం ఓ మలయాళ చిత్రంలో నటిస్తున్నాననీ, ఇక సినిమాలు చేయకూడదనుకుంటున్నానని ఈ సందర్భంగా తషు స్పష్టం చేశారు. దేవంగ్ రాజ్ తయాల్ వ్యాపారవేత్త. ఆయన కుటుంబంతో తమది పదిహేనేళ్ల అనుబంధం అని తషు చెబుతూ -‘‘నేను, దేవంగ్ పెళ్లి చేసుకుంటామని ఎప్పుడూ అనుకోలేదు. రెండు కుటుంబాలు కలుసుకున్నప్పుడు ‘మన స్నేహం ఎందాకా సాగుతుందో’ అని సరదాగా అనుకునేవాళ్లం. దేవంగ్‌తో నా పెళ్లి ప్రతిపాదన తెచ్చింది నా సిస్టరే. ఫ్రెండ్‌ని పెళ్లి చేసుకోవడమా? అని అనిపించింది. కానీ, దేవంగ్ మంచి జీవిత భాగస్వామి అవుతారనే నమ్మకం ఉంది’’ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement