
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న అజ్ఞాతవాసి ట్రైలర్ ఎట్టకేలకు వచ్చింది. గత సాయంత్రం నుంచి ఫ్యాన్స్‌ను ఎంతగానో ఎదురు చూసేలా చేసిన నిర్మాతలు ఎట్టకేలకు అర్ధరాత్రి తర్వాత ట్రైలర్ ను విడుదల చేశారు.
ఇక ట్రైలర్ విషయానికొస్తే... ఓ కుర్చీని తయారు కావటానికి ఓ చెట్టు పడే నొప్పిని వివరిస్తూ.. జీవితంలో కోరుకునే ప్రతీ సౌకర్యం వెనుక ఓ మినీ యుద్ధం ఉంటుందన్న పవన్ డైలాగ్ ఆకట్టుకుంది. మరో నటుడు ఆది పినిశెట్టిని కూడా ఇందులో స్పష్టంగా చూపించారు. ఆపై ఇద్దరు హీరోయిన్లతో రొమాంటిక్, యాక్షన్ సీక్వెన్స్‌లతో ట్రైలర్ కలర్ ఫుల్‌గా ముందుకు సాగింది.
చివర్లో వీడు మళ్లీ సైకిల్ ఎక్కుతాడా? అని మురళీ శర్మ అంటే.. ఏది ఎక్కినా ఫర్వాలేదుగానీ మనల్ని ఎక్కకుంటే చాలూ అని రావు రమేష్ బదులివ్వటం... వీడి చర్యలు ఊహాతీతం డైలాగు ఆకట్టుకున్నాయి. మొత్తానికి టీజర్‌లో అత్తారింటికి దారేది ఛాయలున్నాయన్న విమర్శలకు ట్రైలర్ కాస్త చెక్ పెట్టిందనే చెప్పుకోవాలి. ప్రస్తుతం ట్రైలర్ యూట్యూబ్‌లో దూసుకుపోతోంది.
Comments
Please login to add a commentAdd a comment