ఫస్ట్‌ లేడీ అవార్డు అందుకున్న ఐష్‌ | Aishwarya Rai Bachchan receives First Ladies Award | Sakshi
Sakshi News home page

Published Mon, Jan 22 2018 12:24 PM | Last Updated on Mon, Jan 22 2018 1:02 PM

Aishwarya Rai Bachchan receives First Ladies Award - Sakshi

బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌ ఐశ్వర్యరాయ్‌ రాష్ట్రపతి భవన్‌ లో జరిగిన కార్యక్రమంలో ఫస్ట్‌ లేడీ అవార్డును అందుకున్నారు. రెండు దశాబ్దాలుగా సినీరంగానికి ఆమె అందిస్తున్న సేవలకు గానూ ఈ ఈఅవార్డుకు ఎంపిక చేశారు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చేతుల మీదుగా ఆమె ఈ అవార్డును అందుకున్నారు. పలు రంగాల్లో ఘనవిజయాలు సాధించిన మరికొంతమంది మహిళలకు కూడా ఈ ఫస్ట్‌లేడీ అవార్డులను అందజేశారు.

2002 నుంచి ప్రతీ సంవత్సరం కేన్స్‌ చలన చిత్రోత్సవాలకు హాజరవుతున్న ఐశ్వర్య ఇటీవల ఈ అంతర్జాతీయ చలనచిత్రోత్సవ జ్యూరీ సభ్యురాలిగా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా  మహిళా, శిశు సంక్షేమ శాఖా మంత్రి మేనకా గాంధీ ఐష్‌ను సత్కరించారు. ఐష్‌ తోపాటు చిన్న వయసులోనే పైలెట్‌ అయిన ఆయేషా అజీజ్‌, తొలి మహిళా ఐపీఎస్‌ రువేదా సలామ్‌లతో పాటు మరో 113 మందికి అవార్డు ప్రదానం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement