
అఖిల్ సరసన ప్రగ్యా..!
అక్కినేని వారసుడు అఖిల్ తన రెండో సినిమాను ప్రకటించేశాడు. యూత్ ఫుల్ రొమాంటిక్ సినిమాల దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వంలో తన రెండో సినిమా ఉంటుందంటూ క్లారటీ ఇచ్చేశాడు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ కూడా పూర్తయిన ఈ ప్రాజెక్ట్ త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. అయితే తాజాగా అఖిల్ చేసిన ఓ ఫోటో షూట్ మరో ఆసక్తిరమైన చర్చకు తెర తీసింది.
ఇటీవల ఓ మ్యాగజైన్ కవర్ పేజ్ కోసం కంచె బ్యూటి ప్రగ్యా జైస్వాల్తో కలిసి ఫోటో షూట్లో పాల్గొన్నాడు అఖిల్. ఈ జోడిని చూసిన వారంత అఖిల్ పక్కన ప్రగ్యా ఫర్ఫెక్ట్గా సెట్టయ్యిందంటున్నారట. అంతేకాదు తన కొత్త సినిమాలో ప్రగ్యా హీరోయిన్ అయితే బాగుంటుందన్న అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. మరి మ్యాగజైన కవర్ పేజ్ మీద అలరించిన ఈ జోడి, వెండితెర మీద సందడి చేస్తుందో లేదో చూడాలి.