
తొలి ఒలింపిక్ మెడల్ నేపథ్యంలో అక్షయ్ సినిమా
ఎయిర్ లిఫ్ట్, బేబీ, రుస్తుం లాంటి దేశభక్తి సినిమాలతో ఆకట్టుకున్న బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ అదే జానర్లో మరో సినిమాను ఎనౌన్స్ చేశాడు. ఇప్పటికే వరుస సూపర్ హిట్స్ సాధిస్తున్న ఈ యాక్షన్ స్టార్, ప్రస్తుతం బాలీవుడ్లో మోస్ట్ సక్సెస్ ఫుల్ జానర్గా పేరు తెచ్చుకున్న పీరియడ్ డ్రామాను తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. అక్షయ్ గత చిత్రాలు ఎయిర్ లిఫ్ట్, రుస్తుంలు కూడా పీరియడ్ డ్రామాలుగా తెరకెక్కినవే.
తన ట్విట్టర్ లో కొత్త చిత్రం పై ప్రకటన చేసిన అక్షయ్, భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత 1948లో జరిగిన లండన్ ఒలింపిక్స్ లో సాధించిన తొలి గోల్డ్ మెడల్ నేపథ్యంలో సినిమాను తెరకెక్కిస్తున్నట్టుగా ప్రకటించాడు. ఫర్హాన్ అక్తర్, రితేష్ సిద్వానీలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు అమీర్ ఖాన్ తో తలాష్ సినిమాను తెరకెక్కించిన రీమా కగ్టీ దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాను 2018 ఆగస్టు 18న రిలీజ్ చేయనున్నట్టు తెలిపాడు అక్షయ్ కుమార్.
Set in 1948, the historic story of India's first Olympic medal as a free nation, #GOLD coming to you on 15th August, 2018! pic.twitter.com/KPAExjtmYz
— Akshay Kumar (@akshaykumar) 21 October 2016