Olympic medal
-
బాడ్మింటన్ థీమ్, మసాబా లెహంగా..మహారాణిలా పీవీ సింధు (ఫొటోలు)
-
సివిల్ సర్వీసెస్‌కు ప్రిపేర్ అవ్వాలనుకుని.. ఒలింపిక్ మెడల్ గెలిచి! (ఫొటోలు)
-
ఒలింపిక్ పతకమే మిగిలుంది
న్యూఢిల్లీ: నాలుగు పదుల వయసున్నా... ఏళ్ల తరబడి టేబుల్ టెన్నిస్ ఆడుతున్నా... తనలో వన్నె తగ్గలేదని మాటల్లో కాదు... చేతల్లో నిరూపించాడు వెటరన్ స్టార్ శరత్ కమల్. ఇటీవల ముగిసిన కామన్వెల్త్ గేమ్స్‌లో అద్భుతమైన ప్రదర్శనతో సింగిల్స్, మిక్స్డ్ డబుల్స్‌లో స్వర్ణాలు సహా నాలుగు పతకాలు సాధించాడు. అయితే తన కెరీర్లో 2006 నుంచి ఎన్నో కామన్వెల్త్ పతకాలున్నప్పటికీ ఒలింపిక్స్ పతకం మాత్రం లోటుగా ఉందని, అదే తన లక్ష్యమని శరత్ తెలిపాడు. 20 ఏళ్లుగా ఆడుతున్నప్పటికీ రిటైర్మెంట్ ఆలోచనే రావడం లేదని, ఆటపై తన ఉత్సాహాన్ని వెలిబుచ్చాడు. ‘ప్రతిష్టాత్మక కామన్వెల్త్ గేమ్స్‌లో వ్యక్తిగతంగా అత్యుత్తమ ప్రదర్శన కనబరచడం చాలా ఆనందంగా ఉంది. గతంలో ‘మూడు’గా ఉన్న అత్యధిక పతకాల సంఖ్య తాజా ఈవెంట్లో ‘నాలుగు’కు చేరింది. పూర్తి ఫిట్నెస్ ఉండటంతో ఇకమీదట ఆడాలనే తపనే నన్ను నడిపిస్తోంది. నేనెప్పుడు శారీరకంగానే కాదు మానసికంగాను దృఢంగా ఉండేందుకే ప్రయత్నిస్తా. కుర్రాళ్లతో సహ పోటీపడాలంటే వాళ్లంత చురుగ్గా ఉండాలి కదా! ఓవరాల్‌గా ఇన్నేళ్లలో కామన్వెల్త్ గేమ్స్‌లో 13 సాధించిన నా విజయవంతమైన కెరీర్లో ఒలింపిక్స్ పతకమే బాకీ ఉంది. దాని కోసం మరింత మెరుగయ్యేందుకు శ్రమిస్తున్నాను’ అని శరత్ కమల్ వివరించాడు. పారిస్ ఒలింపిక్స్‌కు రెండేళ్ల సమయం వుండటంతో ముందుగా టీమ్ ఈవెంట్లో అర్హత సాధించడంపై దృష్టి సారిస్తాననని చెప్పాడు. తన తొలి కామన్వెల్త్ (2006)లో సాధించిన స్వర్ణంతో బర్మింగ్‌హామ్ స్వర్ణాన్ని పోల్చకూడదని అన్నాడు. యువ రక్తంతో ఉన్న తనపై అప్పుడు ఎలాంటి అంచనాల్లేవని, కానీ ఇప్పుడు సీనియర్‌గా తనపై గురుతర బాధ్యత ఉండిందని శరత్ వివరించాడు. అప్పటికీ ఇప్పటికీ ఎంతో మారిందని, పోటీతత్వం అంతకంతకు పెరిగిందని అవన్నీ దాటుకొని ఈ వయసులో బంగారం గెలవడం ఎనలేని సంతోషాన్నిస్తోందని చెప్పాడు. -
హ్యాకీ డేస్.. బంగారంలా మెరిసిన భారత కాంస్యం
అప్పట్లో భారత హాకీ జట్టు చాలా అద్భుతంగా ఆడేదట! ఏకంగా ఎనిమిది సార్లు ఒలింపిక్స్‌లో స్వర్ణాలు గెలుచుకుందట! ఒక తరం మొత్తం వింటూ వచ్చిన కథ ఇది. రికార్డు పుస్తకాల్లో, క్విజ్ పోటీల్లో, కొన్నేళ్ల తర్వాత గూగుల్ సెర్చ్‌లో... ఇలా అలనాటి ఘనత గురించి వినడమే తప్ప ఒక్కసారి కూడా మన ఇండియా ఒలింపిక్ పతకం గెలవడం ఈతరం చూడలేదు. ఆఖరిసారిగా 1980లో స్వర్ణం నెగ్గిందని సమాధానం గుర్తించడమే కానీ మన దేశం పతకం సాధించిన రోజు కలిగే ఆనందం ఎలా ఉంటుందో అనుభవిస్తే గానీ అర్థం కాదు. ఇప్పుడు కొత్త తరం క్రీడాభిమానులు కూడా మేం భారత్ ఒలింపిక్ పతకం గెలవడాన్ని చూశామని ఘనంగా చెప్పుకోవచ్చు... జర్మనీని ఓడించి పోడియంపై మన స్టార్లు సగర్వంగా నిలబడిన సమయాన జాతీయ పతాకం ఎగురుతున్న దృశ్యం మా కళ్లల్లో ఎప్పటికీ నిలిచి ఉంటుందని సంతోషాన్ని ప్రకటించవచ్చు! ఆ సమయంలో భావోద్వేగానికి గురికాని భారతీయుడు ఎవరు! మైదానంలో ఆడి గెలిచిన మనోళ్లు సంబరాలు చేసుకున్నారు... హాకీతో సంబంధం లేని ఆటగాళ్లు కూడా ఆనందాన్ని పంచుకుంటున్నారు... మాజీ హాకీ ఆటగాళ్లయితే తామే గెలిచినంతగా గంతులు వేస్తున్నారు... ఒలింపిక్స్‌లో ఆడి పతక విజయంలో భాగం కాలేనివారు ఇప్పుడు గెలిచిన బృందంలో తమను తాను చూసుకుంటున్నారు. ఓడినా, గెలిచినా సుదీర్ఘ కాలంగా భారత హాకీనే ప్రేమిస్తూ వచ్చిన వారి స్పందన గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు... ఈ గెలుపును ఆస్వాదించాలంటే హాకీ అభిమానులే కానవసరం లేదు. భారతీయుడైతే చాలు! టోక్యోలో ఇతర పతకాలు కూడా మన ఖాతాలో చేరుతున్నాయి. కానీ హాకీ విజయాన్ని అందరూ కోరుకున్నారు, ప్రార్థించారు. ఎందుకంటే ఇది ఫలితానికి సంబంధించి మాత్రమే కాదు, ఆ ఆటతో ఎంతో భావోద్వేగాలు ముడిపడి ఉన్నాయి. మరో ఈవెంట్లో ఓడినా, గెలిచినా హాకీ జట్టు మాత్రం పతకం సాధించాలని కోరుకోనివారు లేరంటే అతిశయోక్తి కాదు. 1984, 1988, ...., 2012, 2016... కాలక్రమంలో తొమ్మిది సార్లు ఒలింపిక్స్ వచ్చి వెళ్లాయి... పతకం మాత్రం రాలేదు. ఒకసారి అయితే ఒలింపిక్స్‌లో అడుగు పెట్టే అవకాశం కూడా దక్కలేదు. బంగారు హాకీ ఘనతలు ముగిసిన తర్వాత మొదలైన పతనం వేగంగా సాగిపోయింది. ఈ సారైనా గెలవకపోతారా, ఒక్కసారైనా అద్భుతం జరగకపోతుందా అని ఆశిస్తూ రావడం... ఆ ఆశలు కుప్పకూలడం రొటీన్‌గా మారిపోయాయి. ఒలింపిక్స్‌లో భారత్‌కు పతకాలు అందించే ఆటలు అంటూ అంచనాలు పెంచే జాబితాలోంచి హాకీ పేరు ఎప్పుడో తీసేశారు. కానీ గెలిస్తే బాగుండేదన్న చిరు కోరిక మాత్రం అభిమానుల మనసులో ఏమూలనో ఉండేది. అందుకే ఈ మూడో స్థానమూ మురిపిస్తోంది. పసిడి రాకపోతేనేమి, పునరుజ్జీవం పొందుతున్న ఆటకు ఈ విజయం బంగారంకంటే గొప్ప. 41 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌లో హాకీకి దక్కిన ఈ కాంస్య పతకం విలువ అమూల్యం. టోక్యో: కోట్లాది అభిమానులకు ఆనందం పంచుతూ భారత పురుషుల హాకీ జట్టు ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకుంది. మూడో స్థానం కోసం గురువారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 5–4 గోల్స్ తేడాతో జర్మనీని ఓడించింది. ఒకదశలో 1–3తో వెనుకబడినా స్ఫూర్తిదాయక ప్రదర్శనతో మన టీమ్ చివరకు విజయాన్ని అందుకుంది. భారత్ తరఫున సిమ్రన్‌జిత్ సింగ్ (17వ, 34వ నిమిషాల్లో), హార్దిక్ సింగ్ (27వ నిమిషంలో), హర్మన్‌ప్రీత్ సింగ్ (29వ నిమిషంలో), రూపిందర్‌పాల్ సింగ్ (31వ నిమిషంలో) గోల్స్ సాధించారు. జర్మనీ తరఫున టిమర్ ఒరుజ్ (2వ నిమిషంలో), నిక్లాస్ వెలెన్ (24వ నిమిషంలో), బెనెడిక్ట్ ఫర్క్ (25వ నిమిషంలో), ల్యూకాస్ విండ్‌ఫెడర్ (48వ నిమిషంలో) జర్మనీ జట్టుకు గోల్స్ చేశారు. 1980 మాస్కో ఒలింపిక్స్‌లో భారత జట్టు స్వర్ణం సాధించిన ఇన్నేళ్లకు మళ్లీ భారత్ ఖాతాలో మరో హాకీ పతకం చేరింది. వెనుకంజ వేసి... కాంస్యం సాధించాలనే లక్ష్యంతో ఎన్నో ఆశలతో మ్యాచ్ బరిలోకి దిగిన భారత్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. గత రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత జర్మనీ రెండో నిమిషంలోనే గోల్‌తో ముం దంజ వేసింది. భారత నెమ్మదైన డిఫెన్స్‌ను ఛేదించిన ఒరుజ్ రివర్స్ హిట్‌తో తొలి గోల్ నమోదు చేశాడు. మరో మూడు నిమిషాలకే భారత్‌కు పెనాల్టీ లభించినా అది వృథా అయింది. వరుసగా గోల్ పోస్ట్‌పై దాడులు చేస్తూ జర్మనీ తొలి క్వార్టర్లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. రెండో క్వార్టర్స్‌లో భారత జట్టు కుదురుకుంది. మిడ్ ఫీల్డ్ నుంచి నీలకంఠ శర్మ ఇచ్చిన పాస్‌ను సర్కిల్లో అందుకున్న సిమ్రన్ జర్మనీ కీపర్‌ను తప్పించి రివర్స్ హిట్ కొట్టడంతో స్కోరు సమమైంది. ఈ జోరులో భారత్ అటాక్‌కు ప్రయత్నించినా, జర్మనీ వెంటనే కోలుకుంది. నీలకంఠ, సురేంద్ర కుమార్‌లు చేసిన పొరపాట్లతో బంతిని తమ ఆధీనంలోకి తెచ్చుకున్న జర్మనీ వరుస నిమిషాల్లో రెండు గోల్స్ కొట్టింది. దాంతో ఆ జట్టు ఆధిక్యం 3–1కి పెరిగింది. మళ్లీ దూసుకెళ్లి... గతంలోనైతే ఇలాంటి స్థితి నుంచి భారత్ ఇక ముందుకు వెళ్లడం కష్టంగా మారిపోయేదేమో. కానీ ఎలాంటి ఆందోళన లేకుండా, ఆశలు కోల్పోకుండా భారత్ పట్టుదలగా ఆడటం సత్ఫలితాన్ని ఇచ్చింది. రెండు నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్ చేసి స్కోరును సమం చేసింది. హర్మన్‌ప్రీత్ కొట్టిన పెనాల్టీ కార్నర్‌ను జర్మనీ కీపర్ స్టాడ్లర్ సమర్థంగా అడ్డుకున్నా, రీబౌండ్లో హార్దిక్ దానిని గోల్ పోస్ట్‌లోకి పంపించాడు. ఆ వెంటనే మరో పెనాల్టీ రాగా, ఈసారి హర్మన్‌ప్రీత్ విఫలం కాలేదు. స్కోరు 3–3కు చేరడంతో భారత్ జట్టులో ఒక్కసారిగా ఆత్మవిశ్వాసం పెరిగింది. మూడో క్వార్టర్ మొదటి నిమిషంలోనే భారత్‌కు కలిసొచ్చింది. భారత కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్‌ను జర్మనీ ఆటగాళ్లు సర్కిల్ లోపల మొరటుగా అడ్డుకోవడంతో ‘పెనాల్టీ స్ట్రోక్’ లభించింది. ఎలాంటి ఇబ్బంది లేకుండా రూపిందర్ దీనిని గోల్ చేయడంతో ఆధిక్యం 4–3కు పెరిగింది. మరో మూడు నిమిషాలకే గుర్జంత్ ఇచ్చిన పాస్‌ను అందుకొని దూసుకుపోయిన సిమ్రన్‌జిత్ మరో గోల్ చేయడంతో భారత్ 5–3తో తిరుగులేని స్థితిలో నిలిచింది. ఈ దశలో మరింత దూకుడుగా ఆడిన భారత్‌కు వరుస పెనాల్టీ కార్నర్ అవకాశాలు వచ్చాయి. అయితే అవి గోల్‌గా మారలేదు. చివరి క్వార్టర్లో జర్మనీ మళ్లీ బంతిని తన ఆధీనంలోకి తెచ్చుకుంది. మరో పెనాల్టీ అవకాశం దక్కించుకున్న జర్మనీ దానిని ఉపయోగించుకోవడంతో భారత్ ఆధిక్యం 5–4కు తగ్గింది. మ్యాచ్ ఆఖర్లో స్కోరు సమం చేసేందుకు జర్మనీ తీవ్రంగా ప్రయత్నించింది. తమ గోల్ కీపర్‌ను ఆ స్థానం నుంచి తప్పించి ఫీల్డ్‌లోకి తీసుకొచ్చి దాడులకు దిగింది. అయితే వీటిని మన గోల్ కీపర్ శ్రీజేశ్ సమర్థంగా అడ్డుకోగలిగాడు. తమకు దక్కిన 13 పెనాల్టీ కార్నర్లలో జర్మనీ ఒకదానిని మాత్రమే గోల్‌గా మలచగా... భారత్ 6 పెనాల్టీలలో రెండింటిని గోల్స్‌గా మార్చుకోగలిగింది. 6.8 సెకన్ల ముందు... అద్భుతంగా ఆడటం... ఇక మనం గెలిచేశాం అనుకుంటుండగా చివరి క్షణాల్లో ప్రత్యర్థికి గోల్ సమర్పించి మ్యాచ్‌లు చేజార్చుకున్న దృశ్యం భారత హాకీ చరిత్రలో లెక్కలేనన్ని సార్లు జరిగింది. మన ఉదాసీతనకు తోడు అనూహ్యంగా వచ్చే అటాక్‌ను అంచనా వేసే లోపే ప్రమాదం జరిగిపోతూ ఉంటుంది. మ్యాచ్ ముగియడానికి మరో 6.8 సెకన్ల సమయం మాత్రమే మిగిలి ఉన్న దశలో కూడా జర్మనీకి పెనాల్టీ లభించింది. దీనిని జర్మనీ గోల్ చేసి ఉంటే పరిస్థితి భిన్నంగా ఉండేది. అయితే డిఫెన్స్‌లో ముందుగా దూసుకొచ్చి న అమిత్ రోహిదాస్, కీపర్ శ్రీజేశ్ కలిసి ఆపగలిగారు. అంతే... భారత ఆటగాళ్లు పట్టరాని ఆనందాన్ని ప్రదర్శించగా, జర్మనీ ప్లేయర్లు కుప్పకూలిపోయారు. టిక్..టిక్.. టైమర్ ఆగిపోయింది! మ్యాచ్ మరో 29 సెకన్లలో ముగుస్తుందనగా మైదానంలో ఉన్న అఫీషియల్ టైమర్ పని చేయడం ఆగిపోయింది. కానీ ఆట మాత్రం సాగిపోయింది. చివరకు 11 సెకన్ల తర్వాత అది మళ్లీ పని చేసింది. సాంకేతిక సమస్యలతో టైమర్ పని చేయలేదు. జర్మనీకి 6 సెకన్ల ముందు పెనాల్టీ లభించిందంటే ఒక రకంగా అది అదనపు సమయంలో భారత్‌కు జరిగిన నష్టమే! మ్యాచ్ ముగిశాక కూడా నిర్వాహకులు దీనిపై ఎలాంటి స్పష్టతనివ్వలేదు. భారత జట్టు విజయం సాధించింది కాబట్టి సమస్య రాలేదు కానీ అదే చివరి పెనాల్టీ గోల్‌గా మారి ఉంటే..! -
ఒలింపిక్స్‌లో భారత్‌కు ఇప్పటికీ తీరని లోటు.. కమల్‌ప్రీత్ తీర్చేనా!
అంతా సవ్యంగా సాగితే... ఒలింపిక్స్ క్రీడల్లో ఇప్పటివరకు భారత్‌కు లోటుగా ఉన్న అథ్లెటిక్స్ పతకం ఈరోజు లభించే అవకాశముంది. మహిళల డిస్కస్ త్రో ఫైనల్లో భారత క్రీడాకారిణి కమల్‌ప్రీత్ కౌర్ నేడు తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. పంజాబ్‌కు చెందిన 25 ఏళ్ల కమల్‌ప్రీత్ క్వాలిఫయింగ్‌లో కనబరిచిన ప్రదర్శన ఆధారంగా పతకంపై ఆశలు చిగురించాయి. క్వాలిఫయింగ్‌లోని తన గ్రూప్ ‘బి’లోనే కాకుండా ఓవరాల్‌గా కూడా కమల్‌ప్రీత్ రెండో స్థానంలో నిలువడంతో ఆమెపై అంచనాలు ఒక్కసారిగా పెరిగాయి. స్వర్ణ, రజత, కాంస్య పతకాల కోసం నేటి ఫైనల్లో మొత్తం 12 మంది పోటీపడతారు. ఒక్కొక్కరికి డిస్క్‌ను విసిరేందుకు మూడు అవకాశాలు ఇస్తారు. డిస్క్‌ను ఎక్కువ దూరం విసిరిన ముగ్గురికి వరుసగా స్వర్ణ, రజత, కాంస్య పతకాలు లభిస్తాయి. 2012 లండన్, 2016 రియో ఒలింపిక్స్ చాంపియన్ సాండ్రా పెర్కోవిచ్ (క్రొయేషియా)... ప్రస్తుత ప్రపంచ చాంపియన్ వైమి పెరెజ్ (క్యూబా) క్వాలి ఫయింగ్‌లో కమల్‌ప్రీత్ కంటే వెనుకబడ్డారు. కమల్‌ప్రీత్ డిస్క్‌ను 64 మీటర్ల దూరం విసిరితే... సాండ్రా పెర్కోవిచ్ 63.75 మీట ర్లు... వైమి పెరెజ్ 63.18 మీటర్లు విసి రారు. వలారీ అల్మన్ (అమెరికా) 66.42 మీటర్లు విసిరి క్వాలిఫయింగ్‌లో తొలి స్థానంలో నిలిచింది. అయితే అగ్రశ్రేణి అథ్లెట్స్ క్వాలిఫయింగ్‌లో కంటే ఫైనల్లోనే తమ అత్యుత్తమ ప్రదర్శన కనబరిస్తారు. ఈ నేపథ్యంలో ఫైనల్ ఆసక్తికరంగా సాగే అవకాశముంది. -
తృటిలో ఒలింపిక్ పతకాన్ని చేజార్చుకున్న కేరళ కుట్టి ఎవరో తెలుసా?
సాక్షి, హైదరాబాద్: ఒలింపిక్ క్రీడలు, మహిళలు, బంగారు పతకాలు అనగానే క్రీడాభిమానులకు ఠక్కున గుర్తొచ్చేపేరు పరుగుల రాణి పీటీ ఉష. అభిమానులు పయోలి ఎక్స్‌ప్రెస్‌గా పిల్చుకునే పీటీ ఉష పేరు తెలియని భారతీయుడు ఉండడంటే అతిశయోక్తి కాదు. దేశ కీర్తి కిరీటాన్ని ప్రపంచవ్యాప్తంగా వినిపించేలా చేసిన ఉష అంతర్జాతీయ క్రీడా జీవితంలో మొత్తం 101 స్వర్ణ పతకాలను సాధించారంటే ఆమె ప్రతిభను అర్థం చేసుకోవచ్చు. భారత మహిళా ట్రాక్ అండ్కే ఫీల్డ్‌లో కేరళ కుట్టీ పిలావుళ్ళకండి తెక్కే పఱంబిల్ ఉష 1979 నుంచి దేశానికి పలు విజయాలను అందించారు. 1986 సియోల్ ఆసియా క్రీడలలో 4 బంగారు పతకాలు, రజిత పతకం సాధించి రికార్డు సృష్టించిన ఉష తృటిలో ఒలంపిక్స్ పతకాన్నిచేజార్చుకున్నారు. అవును నిజం. 1980 రష్యా ఒలంపిక్స్ ఉషకుపెద్దగా కలిసిరాలేదు. అయితే 1984 ఒలింపిక్స్‌లో ఎలాగైనా పతకం సాధించాలని ఆశించారు. అమెరికా లోని లాస్ ఏంజిల్స్‌లో జరిగిన క్రీడలలో ఉష సెమీఫైనల్స్‌లో ప్రథమస్థానంలో నిలిచినా, పైనల్స్ లో వెంట్రుకవాసిలో పతకం పొందే అవకాశం కోల్పోయారు. సెకనులో వందోవంతు (0.01) తేడాతో కాంస్య పతకం పొందే అవకాశం జారవిడుచుకున్న విషయం అప్పట్లో భారతీయులను చాలా కాలం వెంటాడింది. 1960లో ప్లయింగ్ సిఖ్ మిల్కా సింగ్‌కు కలిగిన దురదృష్టమే పీటీ ఉషకు కూడా ఎదురైందని భావించారు. అయితే ఒలింపిక్ క్రీడల అథ్లెటిక్స్ లో పైనల్స్ చేరిన తొలి మహిళా క్రీడాకారిణిగా ఆమె రికార్డు సృష్టించారు. ఆమె దేశానికి సాధించిపెట్టిన ఖ్యాతికి గుర్తుగా భారత ప్రభుత్వం పద్మశ్రీ,అర్జున అవార్డులతో సత్కరించింది. కాగా టోక్యో ఒలింపిక్ భారత్‌కు తొలి పతకాన్ని అందించిన వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను చరిత్రలో తన పేరును చిరస్థాయిగా నిలుపుకున్నారు. ఒలింపిక్స్ ప్రారంభం రోజునే పతకం సాధించిన తొలి భారతీయురాలిగా ఖ్యాతి గడించారు. -
విమర్శలను పట్టించుకోను
న్యూఢిల్లీ: ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన తర్వాత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుకు వరుస పరాజయాలు ఎదురయ్యాయి. ఆడిన ప్రతీ టోర్నీలోనూ ఆమె విఫలమైంది. అయితే తనపై వస్తున్న విమర్శలను పట్టించుకోనని, టోక్యో ఒలింపిక్స్‌లో మరో పతకమే లక్ష్యంగా శ్రమిస్తున్నానని సింధు వ్యాఖ్యానించింది. ‘వరల్డ్ చాంపియన్‌గా నిలిచిన తర్వాత వచ్చిన వరుస పరాజయాలతో నేను కుంగిపోలేదు. సానుకూలంగానే ఉన్నా. ప్రతీసారి గెలవడం సాధ్యం కాదు. కొన్ని సార్లు అద్భుతంగా ఆడితే మరికొన్ని సార్లు తప్పులు జరుగుతాయి. వాటి నుంచి పాఠాలు నేర్చుకొని ముందుకు వెళ్లాల్సిందే’ అని సింధు పేర్కొంది. అంచనాలను అందుకునే క్రమంలో ఒత్తిడి పెంచుకోనని కూడా సింధు అభిప్రాయపడింది. ‘నాపై ఎన్నో అంచనాలు ఉంటాయని నాకూ తెలుసు. అయితే ఒత్తిడి, విమర్శలు నాపై ప్రభావం చూపవు. నా టెక్నిక్‌లో కొన్ని లోపాలను సరిదిద్దుకోవడంపై దృష్టి పెట్టా. రెండో ఒలింపిక్ పతకం సాధించాలనే లక్ష్యంపైనే దృష్టి పెట్టా’ అని ఆమె చెప్పింది. ఈనెల 7న మొదలయ్యే మలేసియా మాస్టర్స్ ఓపెన్‌తో ఈ ఏడాదిని మొదలు పెట్టబోతున్న సింధు 20 నుంచి జరిగే ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్)లో కూడా ఆడనుంది. సైనా, శ్రీకాంత్‌వంటి షట్లర్లు పీబీఎల్‌కు దూరమైనా ఆమె మాత్రం టోర్నీ బరిలోకి దిగుతోంది. సొంత ప్రేక్షకులు, అభిమానుల సమక్షంలో ఆడటాన్ని తాను ఆస్వాదిస్తానని, పైగా యువ షట్లర్లకు స్ఫూర్తిగా నిలిచినట్లు కూడా ఉంటుంది కాబట్టి పీబీఎల్‌కు దూరం కానని ఈ లీగ్‌లో హైదరాబాద్ హంటర్స్‌కు ఆడనున్న సింధు స్పష్టం చేసింది. -
ఒలింపిక్ పతకం సాధించినా...
న్యూఢిల్లీ: ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్ సెమీస్‌లో తనకెదురైన ఓటమి గాయం ఒలింపిక్ పతకం సాధించినా మానేది కాదని భారత రెజ్లర్ బజరంగ్ పూనియా స్పష్టం చేశాడు. ఇటీవల ముగిసిన ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో జడ్జీలు తీసుకున్న వివాదాస్పద నిర్ణయం కారణంగా బజరంగ్ ఫైనల్ పోరుకు అర్హత సాధించలేకపోయాడు. ‘మ్యాచ్‌లో పక్షపాతం, మోసం చేయడం ద్వారా ఎదురైయ్యే ఓటమి మనకు నిరుత్సాహాన్ని కలిగిస్తుంది. నేను అక్కడ ఎటువంటి తప్పు చేయలేదు. నేను పసిడి పతకం గెలిచే అవకాశాన్ని నా తప్పుల ద్వారా చేజార్చుకోలేదు. ప్రపంచ చాంపియన్‌షిప్, ఒలింపిక్స్‌లు భిన్నమైన టోరీ్నలు. నేను ప్రపంచ చాంపియన్‌షిప్ కోసం చాలా కష్టపడ్డా. ఒలింపిక్ పతకం గెలిచినా ప్రస్తుతం నాకు ఎదురైన ఓటమి గాయం మానదు. ఇటువంటి ఓటములు భవిష్యత్తులో ఎదురైతే నాకు ఈ ఓటమే గుర్తొస్తుంది’ అంటూ బజరంగ్ బదులిచ్చాడు. జాతీయ క్రీడగా రెజ్లింగ్‌ను ప్రకటించండి! జాతీయ క్రీడగా రెజ్లింగ్‌ను ప్రకటించాలని బజరంగ్ డిమాండ్ చేశాడు. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పతకాలు సాధించిన రెజ్లర్లకు క్రీడల మంత్రి కిరణ్ రిజిజు మంగళవారం అభినందన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇందులో పాల్గొన్న భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ జాతీయ క్రీడగా రెజ్లింగ్ చేయాలనే ఆలోచన చేయగా దానికి బజరంగ్ మద్దతు తెలిపాడు. ప్రపంచ వేదికల మీద గత కొంత కాలంగా రెజ్లింగ్ భారత్‌కు పతకాలు అందిస్తూ వస్తోంది. అటువంటి రెజ్లింగ్‌ను జాతీయ క్రీడగా చేయడం సరైనదే అని బజరంగ్ అభిప్రాయపడ్డాడు. అయితే దీనిపై ఆచితూచి స్పందించిన క్రీడల మంత్రి తనకు అన్ని క్రీడలు సమానమేనని, వాటి అభివృద్ధికి దోహదపడతానని అన్నారు. నగదు పురస్కారాల ప్రదానం... ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పతకాలు సాధించిన ఐదుగురు భారత రెజ్లర్లను కిరణ్ రిజిజు నగదుతో సత్కరించారు. రజతం గెలిచిన దీపక్ పూనియాకు రూ.7 లక్షలు, కాంస్యాలు సాధించిన బజరంగ్, వినేశ్ ఫొగాట్, రాహుల్ అవారే, రవి దహియాలకు తలా రూ.4 లక్షల రూపాయల చెక్‌లను బహూకరించారు. -
తొలి ఒలింపిక్ మెడల్ నేపథ్యంలో అక్షయ్ సినిమా
ఎయిర్ లిఫ్ట్, బేబీ, రుస్తుం లాంటి దేశభక్తి సినిమాలతో ఆకట్టుకున్న బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ అదే జానర్లో మరో సినిమాను ఎనౌన్స్ చేశాడు. ఇప్పటికే వరుస సూపర్ హిట్స్ సాధిస్తున్న ఈ యాక్షన్ స్టార్, ప్రస్తుతం బాలీవుడ్లో మోస్ట్ సక్సెస్ ఫుల్ జానర్‌గా పేరు తెచ్చుకున్న పీరియడ్ డ్రామాను తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. అక్షయ్ గత చిత్రాలు ఎయిర్ లిఫ్ట్, రుస్తుంలు కూడా పీరియడ్ డ్రామాలుగా తెరకెక్కినవే. తన ట్విట్టర్ లో కొత్త చిత్రం పై ప్రకటన చేసిన అక్షయ్, భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత 1948లో జరిగిన లండన్ ఒలింపిక్స్ లో సాధించిన తొలి గోల్డ్ మెడల్ నేపథ్యంలో సినిమాను తెరకెక్కిస్తున్నట్టుగా ప్రకటించాడు. ఫర్హాన్ అక్తర్, రితేష్ సిద్వానీలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు అమీర్ ఖాన్ తో తలాష్ సినిమాను తెరకెక్కించిన రీమా కగ్టీ దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాను 2018 ఆగస్టు 18న రిలీజ్ చేయనున్నట్టు తెలిపాడు అక్షయ్ కుమార్.Set in 1948, the historic story of India's first Olympic medal as a free nation, #GOLD coming to you on 15th August, 2018! pic.twitter.com/KPAExjtmYz— Akshay Kumar (@akshaykumar) 21 October 2016 -
చెత్తకుండీలో ఒలింపిక్ గోల్డ్ మెడల్!
ఒలింపిక్ గోల్డ్ మెడల్ పోయిందని బాధపడుతున్న ఆమెరికా అథ్లెట్ చెంతకు పతకం చేరడంతో అతడి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. 1992లో బార్సిలోనాలో జరిగిన ఒలింపిక్స్ లో రోయింగ్ విభాగంలో జో జాకోబి స్వర్ణం కైవసం చేసుకున్నాడు. అయితే మాజీ ఒలింపియన్ జో జాకోబి గత జూన్ లో తన పతకం పోయిందని పోలీసులకు ఫిర్యాదుచేశాడు. తన కారులో నుంచి ఒలింపిక్ స్వర్ణ పతకాన్ని పతకాన్ని ఎవరో చోరీ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేయడంతో అందరికీ ఆ విషయం తెలిసిపోయింది. ఇది జరిగిన దాదాపు రెండు నెలల తర్వాత తండ్రితో కలిసి వెళ్తుండగా ఏడేళ్ల అట్లాంటా చిన్నారి కోల్ స్మిత్ ఓ చెత్తకుండీలో స్వర్ణ పతకాన్ని గుర్తించింది. ఈ పతకం జకోబి పతకం అని తండ్రీకూతుళ్లు నిర్ధారించుకున్నారు. అతడికి పతకాన్ని అందేలా చేశారు. చిన్నారి కోల్ స్మిత్ గురించి తెలుసుకుని ఆమె చదువుతున్న పాఠశాలకు వెళ్లి ప్రత్యేకంగా ఆమెను అభినందించాడు. దీంతో ఆ స్కూలు యాజమాన్యంతో పాటు చిన్నారి స్నేహితులకు ఆమె చేసిన గొప్పపని గురించి తెలిసింది. చిన్నారి కోల్ స్మిత్ కూడా స్వర్ణ పతకాన్ని చేతిలోకి తీసుకుని ఫొటోలకు ఫోజులిచ్చింది. ఈ సందర్భంగా మళ్లీ తన వద్దకు చేరిన మెడల్ ను స్కూలు విద్యార్థులకు చూపించాడు. గొప్ప అథ్లెట్ తమ స్కూలుకు రావడంతో యాజయాన్యంతో పాటు విద్యార్థులు ఆశ్చర్యానికి లోనయ్యారు. -
'భవిష్యత్తులో మరిన్ని పథకాలు సాధిస్తాను'
-
స్వర్ణం నా చివరి కోరిక: బల్బీర్
చండీగఢ్: శ్రీజేశ్ నాయకత్వంలోని భారత హాకీ జట్టు ఒలింపిక్ పతకం సాధిస్తుందనే నమ్మకముందని హాకీ దిగ్గజం బల్బీర్ సింగ్ విశ్వాసం వ్యక్తం చేశాడు. హాకీ జట్టు ఒలింపిక్స్ స్వర్ణం సాధిస్తే చూడాలనేదే తన చివరి కోరికని ఈ 92 ఏళ్ల మాజీ క్రీడాకారుడు పేర్కొన్నారు. స్వాతంత్య్రం వచ్చాక వరుసగా మూడు ఒలింపిక్స్‌లో (1948, 1952, 1956) పసిడిని సాధించిన హాకీ జట్టులో బల్బీర్ సభ్యుడు. అంతేకాకుండా భారత హాకీ జట్టుకు చీఫ్ కోచ్‌గా, మేనేజర్‌గా సేవలందించారు. -
11ఏళ్ల తర్వాత మెడల్ ఇచ్చారు
నిజాయితీకి నిలకడ మీద గుర్తింపు వస్తుందని ఈ ఒలింపియన్ నిరూపించాడు. ఆడిన 11ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియన్ సైక్లిస్ట్ మైఖేల్ రోజర్స్ ఒలింపిక్ కాంస్యపతకం అందుకున్నాడు. 35 ఏళ్ల ఈ సైక్లిస్ట్ 2004 ఏథెన్స్ ఒలింపిక్స్ సైక్లింగ్ లో పాల్గొన్నాడు. వ్యక్తిగత విభాగంలో నాలుగో స్థానంతో రేస్ ముగించాడు. మూడేళ్ల క్రితం ఈ రేస్ విజేత టేలర్ హామిల్టన్ డోపింగ్ చేసినట్లు ఒప్పుకోవడంతో.. నాలుగో స్థానంలోని రోజర్స్ కు కాంస్య పతకం దక్కింది. ఐఓసీ నిర్వహించిన ఒక కార్యక్రమంలో రోజర్స్ కు ఒలింపిక్ పతకాన్ని అందించారు. దీనిపై స్పందిస్తూ.. 11 ఏళ్ల తర్వాత ఇలా తన కష్టానికి ఫలితం దక్కడం సంతోషంగా ఉందన్నాడు. ఇది ఏథెన్స్ క్రీడలు తనకు మిగిల్చిన గొప్ప జ్ఞాపకంగా అభివర్ణించాడు. ఇక డోప్ టెస్ట్ లో పాజిటివ్ గా వచ్చినా.. ఏథెన్స్ ఒలింపిక్స్ సైక్లింగ్ విజేత అమెరికన్ క్రీడాకారుడు హామిల్టన్ వద్ద ఉన్న పతకాన్ని ఐఓసీ వెనక్కి తీసుకోలేదు.. అప్పట్లో హామిల్టన్ బీ శాంపిల్ ప్రమాదవశాత్తు పాడై పోవడంతో నిషేధానికి గురికాకుండా బయటపడ్డాడు. అయితే.. తర్వాత ఏడాది డోపీగా దొరికి రెండేళ్ల నిషేధం ఎదుర్కొన్నాడు. 2009లో మరోసారి హామిల్టన్ శాంపిల్ పాజిటివ్ గా వచ్చింది. దీంతో ఎనిమిదేళ్ల శిక్ష పడింది. అయితే 2011లో మీడియాకిచ్చిన ఒక ఇంటర్వ్యూలో హామిల్టన్.. తాను ఏథెన్స్ ఒలింపిక్స్ సందర్భంలో కూడా డోపింగ్ చేసినట్లు ఒప్పుకోవడంతో.. ఒలింపిక్స్ కమిటీ హామిల్టన్ నుంచి పతకాన్ని వెనక్కి తీసుకుంది. -
ఒలింపిక్స్ పతకమే లక్ష్యం: సాకేత్
ఎన్ఏడీ జంక్షన్ (విశాఖపట్నం): ప్రభుత్వ ప్రోత్సాహం ఉంటే భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధిస్తానని ఆంధ్రప్రదేశ్ టెన్నిస్ యువతార సాకేత్ మైనేని విశ్వాసం వ్యక్తం చేశాడు. 2016 రియో డి జనీరో ఒలింపిక్స్‌లో పతకం సాధించడమే తన లక్ష్యమని వివరించాడు. ఇంచియాన్ ఆసియా క్రీడల్లో మిక్స్డ్ డబుల్స్‌లో స్వర్ణం, పురుషుల డబుల్స్‌లో రజతం నెగ్గిన సాకేత్ శుక్రవారం తన స్వస్థలం విశాఖపట్టణానికి చేరుకున్నాడు. విమానాశ్రయంలో అతనికి తల్లిదండ్రులు సరోజ, ప్రసాద రావు, శివా టెన్నిస్ సెంటర్ సభ్యులు, మిత్రులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆసియా క్రీడల్లో ఆడడం, స్వర్ణం సాధించడం ఎంతో సంతోషంగా ఉందన్నాడు.