
స్వర్ణం నా చివరి కోరిక: బల్బీర్
చండీగఢ్: శ్రీజేశ్ నాయకత్వంలోని భారత హాకీ జట్టు ఒలింపిక్ పతకం సాధిస్తుందనే నమ్మకముందని హాకీ దిగ్గజం బల్బీర్ సింగ్ విశ్వాసం వ్యక్తం చేశాడు. హాకీ జట్టు ఒలింపిక్స్ స్వర్ణం సాధిస్తే చూడాలనేదే తన చివరి కోరికని ఈ 92 ఏళ్ల మాజీ క్రీడాకారుడు పేర్కొన్నారు. స్వాతంత్య్రం వచ్చాక వరుసగా మూడు ఒలింపిక్స్‌లో (1948, 1952, 1956) పసిడిని సాధించిన హాకీ జట్టులో బల్బీర్ సభ్యుడు. అంతేకాకుండా భారత హాకీ జట్టుకు చీఫ్ కోచ్‌గా, మేనేజర్‌గా సేవలందించారు.