
ఇస్తాంబుల్ : ‘చేతివరకు వచ్చింది.. నోటి వరకు రాలేదు’ అన్న సామెత గుర్తుంది కదండీ. ఓ నటుడు ఇదే విషయాన్ని చెబుతూ ఓ ఫన్నీ వీడియోను షేర్ చేశారు. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో వైరల్ అయింది. టర్కీకి చెందిన ఐస్‌క్రీమ్ అమ్మే చిరువ్యాపారి తన నైపుణ్యాన్ని ఎలా ప్రదర్శించాడో తెలియాలంటే వీడియో చూడాల్సిందే.
హాస్య నటుడు అలీ అస్ఘర్ పలు బాలీవుడ్ మూవీల్లో, వెబ్ సిరీస్‌లో నటించారు. ఆయన ఇటీవల టర్కీ పర్యటనకు వెళ్లారు. ఈ క్రమంలో ఇస్తాంబుల్‌లో ఐస్‌క్రీమ్ తినాలని ఆశపడ్డారు. షాపు అతడికి ఐస్‌క్రీమ్ కావాలని చెప్పగా.. అతడు పలుమార్లు ఐస్‌క్రీమ్ నటుడి చేతిలో పెట్టినట్లే చేసి.. చాకచక్యంగా వెనక్కి తీసేసుకున్నారు. చివరకు నటుడి చేతికి ఐస్‌క్రీమ్ ఇచ్చి డ్రామాకు ఫుల్‌స్టాప్ పేట్టేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను అలీ అస్ఘర్ ట్విటర్‌లో పోస్ట్ చేయగా నెటిజన్లను ఆకట్టుకుంటోంది. నటుడికి చుక్కలు చూపించాడని కొందరు కామెంట్ చేయగా.. పాపం నటుడి ఓపికకు పెద్ద పరీక్ష పెట్టాడని మరికొందరు రీట్వీట్లు చేస్తున్నారు. చివరకు ఎంచక్కా ఐస్‌క్రీమ్‌ను నటుడు ఎంజాయ్ చేస్తూ తినేశారు.
Comments
Please login to add a commentAdd a comment