Ice cream man
-
‘ఐస్‌క్రీమ్ మ్యాన్ ఆఫ్ ఇండియా’ కన్నుమూత
దేశంలోని అగ్రశ్రేణి ఐస్ క్రీమ్ బ్రాండ్లలో ఒకటైన నేచురల్స్ ఐస్ క్రీమ్ వ్యవస్థాపకుడు రఘునందన్ శ్రీనివాస్ కామత్ కన్నుమూశారు. 70 ఏళ్ల వయసులో శుక్రవారం సాయంత్రం ముంబైలోని హెచ్ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్లో ‘ఐస్‌క్రీమ్ మ్యాన్ ఆఫ్ ఇండియా’ తుది శ్వాస విడిచారు.రఘునందన్ శ్రీనివాస్ కామత్‌కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. చాలా సాధారణ నేపథ్యం నుంచి వచ్చిన ఆయన.. ఎన్నో కష్టాలు పడి దేశంలోని అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యాలలో ఒకదానిని నిర్మించారు. కర్ణాటకలోని మంగళూరు తాలూకాలో ముల్కి అనే పట్టణంలో తన కెరీర్‌ను ప్రారంభించిన కామత్, నేచురల్స్ ఐస్‌క్రీమ్‌ను స్థాపించి ‘ఐస్‌క్రీమ్ మ్యాన్ ఆఫ్ ఇండియా’గా ప్రసిద్ధి చెందారు. నేడు దీని విలువ సుమారు రూ. 400 కోట్లు.రఘునందన్ శ్రీనివాస్ కామత్ తండ్రి పండ్ల వ్యాపారి. చిన్నతనంలో పండ్ల వ్యాపారంలో తన తండ్రికి సహాయం చేసేవాడు. అలా పండ్ల గురించిన సంపూర్ణ జ్ఞానాన్ని పెంచుకున్న కామత్ 14 సంవత్సరాల వయస్సులో తన గ్రామాన్ని విడిచి ముంబైకి పయనమయ్యాడు. 1984లో కేవలం నలుగురు సిబ్బంది, కొన్ని ప్రాథమిక పదార్థాలతో ఐస్ క్రీం వ్యాపారాన్ని ప్రారంభించాడు. అలా నేచురల్స్ ఐస్‌క్రీమ్ పుట్టింది. -
కమెడియన్‌కు చుక్కలు చూపించాడు..
ఇస్తాంబుల్ : ‘చేతివరకు వచ్చింది.. నోటి వరకు రాలేదు’ అన్న సామెత గుర్తుంది కదండీ. ఓ నటుడు ఇదే విషయాన్ని చెబుతూ ఓ ఫన్నీ వీడియోను షేర్ చేశారు. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో వైరల్ అయింది. టర్కీకి చెందిన ఐస్‌క్రీమ్ అమ్మే చిరువ్యాపారి తన నైపుణ్యాన్ని ఎలా ప్రదర్శించాడో తెలియాలంటే వీడియో చూడాల్సిందే. హాస్య నటుడు అలీ అస్ఘర్ పలు బాలీవుడ్ మూవీల్లో, వెబ్ సిరీస్‌లో నటించారు. ఆయన ఇటీవల టర్కీ పర్యటనకు వెళ్లారు. ఈ క్రమంలో ఇస్తాంబుల్‌లో ఐస్‌క్రీమ్ తినాలని ఆశపడ్డారు. షాపు అతడికి ఐస్‌క్రీమ్ కావాలని చెప్పగా.. అతడు పలుమార్లు ఐస్‌క్రీమ్ నటుడి చేతిలో పెట్టినట్లే చేసి.. చాకచక్యంగా వెనక్కి తీసేసుకున్నారు. చివరకు నటుడి చేతికి ఐస్‌క్రీమ్ ఇచ్చి డ్రామాకు ఫుల్స్టాప్ పేట్టేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను అలీ అస్ఘర్ ట్విటర్లో పోస్ట్ చేయగా నెటిజన్లను ఆకట్టుకుంటోంది. నటుడికి చుక్కలు చూపించాడని కొందరు కామెంట్ చేయగా.. పాపం నటుడి ఓపికకు పెద్ద పరీక్ష పెట్టాడని మరికొందరు రీట్వీట్లు చేస్తున్నారు. చివరకు ఎంచక్కా ఐస్‌క్రీమ్‌ను నటుడు ఎంజాయ్ చేస్తూ తినేశారు. -
ఐస్‌క్రీమ్ తాతను చూసి గుండె కరిగి..
చికాగో: వయసు పైబడిన ఓ ముసలాయన ఒంట్లో శక్తినంతా కూడదీసుకుని ఐస్ క్రీమ్ బండిని నెట్టుకుంటూ పోతున్నాడు. అదేదో సరదా కోసం చేస్తున్నదో లేక అలవాటైన పనోకాదని ఆయన అవస్థ చూస్తే అర్థమైపోతుంది. సోషల్ సెక్యూరిటీ ఉండి కూడా ఈ వయసులో ఆయనింత కష్టపడుతున్నడెందుకో! చికాగో మహానగర శివారు గ్రామంలో ఐస్ క్రీమ్ లు అమ్ముకునే ఫిడెన్సియో శాంచేజ్ ను చాలామంది చాలాసార్లు చూసి ఉండొచ్చు. అందులో కొందరు 'అయ్యో!' అని సానుభూతి వ్యక్తం చేసి ఉండొచ్చు. మెక్సికన్ వ్యాపారి జోయెల్ మాత్రం సానుభూతితోనే సరిపెట్టలేదు. కారు ఆపి, ఐస్ క్రీమ్ తాత దగ్గరికెళ్లి ఆయన కథేంటో తెలుసుకున్నాడు. 89 ఏళ్ల ఫిడెన్సియో శాంచేజ్ తన భార్య ఎలాడియాతో కలిసి ఓ చిన్న ఇంట్లో నివసిస్తున్నాడు. కొన్నేళ్ల కిందట ఫరవాలేదనే స్థాయిలో జీవించిన ఆ జంట.. ఒక్కగానొక్క కూతురి మరణంతో శోకసముద్రంలో మునిగిపోయింది. ఆ విషాదం నుంచి తేరుకుందామనుకునేలోపే ఎలాడియాకు జబ్బుచేసింది. భార్యకు వైద్యం చేయించేందుకు ఉన్న డబ్బంతా ఖర్చుపెట్టేసిన శాంచేజ్.. నెలవారీ మందుల కోసం ఉన్న ఊళ్లోనే ఇలా ఐస్ క్రీమ్స్ అమ్ముతున్నాడు. ఐస్ క్రీమ్ తాత శాంచేజ్ కథ విన్న జోయెల్.. తనకు తోచిన సహాయం చేయడమేకాక 'గో ఫండ్ మీ' ఫేస్ బుక్ పేజ్ ను తెరిచి వృద్ధ దంపతుల కోసం 3వేల డాలర్ల విరాళాన్ని కోరాడు. శుక్రవారం రాత్రి తెరుచుకున్న 'గో ఫండ్ మీ' పేజ్ కు ఆదివారం ఉదయానికల్లా 1500 డాలర్ల విరాళాలు అందాయి. జోయెల్ తోపాటు దాతలందరికీ ధన్యవాదాలు చెబుతున్నారు ఐస్ క్రీమ్ తాత- బామ్మలు.