బాలీవుడ్ భామ అలియా భట్ హంగు ఆర్భాటాలకు దూరంగా ఉంటానని చెప్పారు. ఓ ఇంటర్వ్యూలో అలియా మాట్లాడుతూ.. ‘నాకు నిరాడంబరంగా ఉండటమే ఇష్టం. అనవసరపు ఖర్చులు చేయను. ఓ టీనేజర్‌గా ఉన్నప్పటి నుంచే ఖరీదైన వస్తువులు కొనాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించేదాన్ని’ అని అన్నారు. అయితే తనకు.. హ్యాండ్ బ్యాగ్స్, అథ్లైజర్ దుస్తుల(వ్యాయామం చేసేటపుడు ధరించే దుస్తులు)పై మక్కువ ఎక్కువని. వాటి కోసం మాత్రం కాస్త ఎక్కువ డబ్బులు ఖర్చు చేస్తానని చెప్పారు. కానీ హాలీడే ట్రిప్స్‌కు వెళ్లినప్పుడు తనకు షాపింగ్ చేయడమంటే ఇష్టముండదన్నారు. కాగా తన మొదటి సంపాదనతో ఖరీదైన ‘లూయిస్ వుట్టన్’ హ్యాండ్ బ్యాగ్‌ను మొదటిసారిగా కోనుగొలు చేసినట్లు అలియా తెలిపారు. ఇక ఫోర్బ్స్ సంస్థ విడుదల చేసిన 2019లో అత్యధికంగా సంపాదించిన నటుల జాబితాలో అలియా టాప్ 10లో నిలిచిన విషయం తెలిసిందే.
ఇక తన కలల ఇంటి గురించి అలియా మాట్లాడుతూ.. ‘నాకు విలాసవంతమైన ప్రైవేటు జెట్‌తో పాటు పర్వతాల మధ్య ఒక ఇల్లు కట్టుకోవాలన్నది నా కల. భవిష్యత్తులో కచ్చితంగా వాటిని నెరవేర్చుకుంటాను. అదేవిధంగా లండన్‌లో ఒక ఇంటిని కొనాలన్న నా కలను నెరవేర్చుకున్నాను కూడా. 2018లో కోవెంట్ గార్డెన్‌లోని ఓ ఇంటిని కొనుగోలు చేశాను. ప్రస్తుతం నా సోదరి అక్కడ నివసిస్తున్నారు’ అని చెప్పారు. కాగా అలియా ముంబాయ్‌లోని జుహులో సొంతంగా ఒక ఇంటిని కొన్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment