కెరీర్‌ ఎవరెస్ట్‌కి! | Alia Bhatt to play amputee-mountaineer Arunima Sinha, next | Sakshi
Sakshi News home page

కెరీర్‌ ఎవరెస్ట్‌కి!

Published Tue, Mar 5 2019 1:36 AM | Last Updated on Tue, Mar 5 2019 1:36 AM

Alia Bhatt to play amputee-mountaineer Arunima Sinha, next  - Sakshi

ఆలియా భట్‌

ఇండియన్‌ ఇండస్ట్రీల్లో ప్రస్తుతం బయోపిక్స్‌పై విపరీతమైన క్రేజ్‌ ఉంది. ఈ క్రేజ్‌ని బాక్సాఫీస్‌ దగ్గర క్యాష్‌ చేసుకోవాలనో, ఒక వ్యక్తి గురించి చెప్పాలనో కానీ దర్శక– నిర్మాతలు ఈ జానర్‌పై విపరీతమైన ఆసక్తి చూపిస్తున్నారు. ఆల్రెడీ చాలా బయోపిక్‌లు రిలీజ్‌ అయ్యాయి. బాలీవుడ్‌లో మరో అరడజను సినిమాలు సెట్స్‌పై కూడా ఉన్నాయి. ఇంకా దర్శక– నిర్మాతలు కొత్త బయోపిక్స్‌ అనౌన్స్‌ చేస్తూనే ఉన్నారు. లేటెస్ట్‌గా హిమాలయాలను అధిరోహించిన అరుణిమా సిన్హా జీవితాన్ని సిల్వర్‌ స్కీన్‌పై చూపించడానికి సిద్ధమయ్యారు. అరుణిమ పాత్రను ఆలియా భట్‌ పోషించనున్నారని బాలీవుడ్‌ టాక్‌. అరుణిమా సిన్హా వాలీబాల్‌ ప్లేయర్‌. ఓసారి బందిపోటు దొంగల బారినపడి, వాళ్లు ట్రైన్‌లో నుంచి తోసేయడంతో ఒక కాలును పోగొట్టుకున్నారామె.

అయినా నిరాశపడకుండా విధి తనకో చాలెంజ్‌ విసిరిందనుకొని భావించి, హిమాలయాలను అధిరోహించాలని శి„ý ణ పొందారు. 2012లో మౌంట్‌ ఎవరెస్ట్‌ ఎక్కారు. ఈ రికార్డ్‌ స్థాపించిన ఫస్ట్‌ ఫిజికల్లీ చాలెంజ్డ్‌ ఉమన్‌గా రికార్డు సృష్టించారామె. ఆమె జీవితం ఆధారంగా తీయబోతున్న చిత్రం 2020లో ఆరంభం అవుతుంది. ముందుగా కంగనా రనౌత్‌ని అనుకున్నారట. ఇప్పుడు ఆమె ప్లేస్‌లోకు ఆలియా వచ్చారు. ధర్మ ప్రొడక్షన్స్, వివేక్‌ రంగాచారి నిర్మించనున్నారు. ‘గల్లీ బాయ్‌’తో బ్లాక్‌బస్టర్‌ అందుకున్న ఆలియా చేతిలో ప్రస్తుతం ‘కళంక్, బ్రహ్మాస్త్ర, తక్త్‌’ వంటి భారీ చిత్రాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ మౌంట్‌ ఎవరెస్ట్‌ను  అధిరోహించే పాత్ర తన యాక్టింగ్‌కు సవాల్‌. ఈ మౌంట్‌ ఎవరెస్ట్‌ ఎక్కే ప్రక్రియలో బాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్‌ చైర్‌ను కూడా ఆలియా ఈజీగా అందుకోవచ్చని ఊహించవచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement