
కంచు లాంటి అల్లుడు
‘అల్లరి’ నరేశ్ సినిమా అంటే నవ్వులు గ్యారెంటీ. సోలోగా కామెడీ చేసి, ప్రేక్షకులను పొట్ట చెక్కలయ్యేలా నవ్వించిన నరేశ్ తన 50వ సినిమా ‘మామ మంచు - అల్లుడు కంచు’లో డా. మోహన్ బాబుతో కలిసి తెర మీద సందడి చేయనున్నారు. శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై మంచు విష్ణు నిర్మించిన ఈ చిత్రంలో మోహన్‌బాబు సరసన రమ్యకృష్ణ, మీనా కథానాయికలు. నరేశ్ సరసన పూర్ణ నటించారు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. డిసెంబర్ 25న చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: విజయ్‌కుమార్, సమర్పణ: అరియానా, వివియానా, విద్యా నిర్వాణ.