నిను చూసి ఆగగలనా! | Allu Arjun and Pooja Hegde Song is A Massive Hit | Sakshi
Sakshi News home page

నిను చూసి ఆగగలనా!

Published Sun, Sep 29 2019 2:12 AM | Last Updated on Sun, Sep 29 2019 2:12 AM

Allu Arjun and Pooja Hegde Song is A Massive Hit - Sakshi

అల్లు అర్జున్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘అల...వైకుంఠపురములో..’. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో అల్లు అరవింద్, ఎస్‌. రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. ఈ సినిమాలోని ‘సామజవరగమన.. నిను చూసి ఆగగలనా?’ లిరికల్‌ వీడియోను శనివారం విడుదల చేశారు. ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి ఈ పాటను రాశారు. తమన్‌ సంగీతం అందించగా సిద్ధ్‌ శ్రీరామ్‌ ఆలపించారు. ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి మాట్లాడుతూ– ‘‘కుర్రతనం.. తుంటరితనం.. కొంటెతనం ఉండే పాట రాయమని అడిగినప్పుడు కొన్ని క్లాసికల్‌ పదాలు రాయాలనిపించింది. అవకాశం ఇచ్చిన త్రివిక్రమ్‌కు థ్యాంక్స్‌. బన్నీ ఏ పాత్రలో అయినా చక్కగా ఒదిగిపోగలడు. తమన్‌ మంచి సంగీతం అందించారు. శ్రీరామ్‌ బాగా పాడారు’’ అన్నారు. ‘‘బన్నీకి ఇప్పటివరకు 12 పాటలకు వర్క్‌ చేశాను. ఈ సారి కొత్తగా ఉండాలని ఈ పాటను రెడీ చేశాం. శాస్త్రిగారు అద్భుతమైన లిరిక్స్‌ ఇచ్చారు’’ అన్నారు తమన్‌. జనవరి 12న చిత్రాన్ని రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు. ఈ సినిమాకు ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: పీడీవీ ప్రసాద్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement