Thrivikram srinivas
-
మీనాక్షి చౌదరి ఫేట్ మార్చేసిన మహేశ్ బాబు
హర్యానా బ్యూటీ మీనాక్షి చౌదరి ఫేట్ మారిపోయింది. త్రివిక్రమ్-మహేశ్ బాబు కాంబోలో వస్తున్న 'గుంటూరు కారం' ప్రాజెక్ట్ నుంచి పూజా హెగ్డే తప్పుకోవడంతో ఆ స్థానంలోకి మీనాక్షి చౌదరి వచ్చి చేరింది. దీంతో ఆమె ఫేట్ ఒక్కసారిగా మారిపోయిందని చెప్పవచ్చు. మీనాక్షి చౌదరి తన కెరీర్‌ని సుశాంత్‌తో కలిసి 'ఇచ్చట వాహనములు నిలుపరాదు'తో ప్రారంభించింది. ఆ చిత్రం అంతగా ఆడలేదు. ఆ తర్వాత రవితేజతో ఖిలాడిలో కనిపించినా అంతగా గుర్తింపు దక్కలేదు. కానీ మహేశ్ బాబు సినిమాలో ఛాన్స్ దక్కగానే ఆమెకు ఒక్కసారిగా భారీ ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ఇందులో భాగంగానే.. విశ్వక్ సేన్, వరుణ్ తేజ్, దుల్కర్ సల్మాన్ వంటి స్టార్ హీరోలతో పాటు కోలీవుడ్ మోస్ట్ పాపులర్ హీరో అయిన దళపతి విజయ్‌తో జతకట్టే లక్కీ ఛాన్స్ తక్కినట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవలే విజయ్ ఆంటోనీ 'కొలై' చిత్రంతో కోలీవుడ్లోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీకి ఆ సినిమా అంతగా ఆడకపోయినా ఆమెకు వస్తున్న పాపులారిటీతో పలు సినిమా ఆఫర్లు వచ్చేస్తున్నాయి. (ఇదీ చదవండి: శ్రీదేవి మృతిపై అసలు నిజాలు బయటపెట్టిన బోనీ కపూర్!) లియో చిత్రం చేస్తున్న విజయ్ తాజాగా తన 68వ చిత్రానికి సిద్ధమవుతున్నారు. వెంకట్రావు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ భారీ ఎత్తున నిర్మిస్తోంది. ఈ చిత్ర ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఇప్పటికే మొదలయ్యాయి. ఇందులో నటుడు విజయ్ తండ్రి-కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు సమాచారం. యువన్ శంకరాజా సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రంలో నటి స్నేహ, ప్రియాంక మోహన్, ప్రశాంత్, ప్రభుదేవా, అరవిందస్వామి తదితరులు ముఖ్యపాత్రలు పోషించనున్నట్లు ప్రచారం జరిగింది. కాగా ఇప్పుడు ప్రియాంక మోహన్ స్థానంలో నటి మీనాక్షి చౌదరిని తీసుకున్నట్లు సమాచారం. -
టాలీవుడ్ ఎంట్రీకి సూర్య రెడీ.. ఆ దర్శకుడుతో సెట్ అయ్యేనా!
-
ఇండియన్ స్టార్ కావడమే నా లక్ష్యం
‘‘నాలుగు సినిమాలు ఒకేసారి చేయగల సత్తా నాకుంది. ఇప్పుడు తెలుగులో రెండు సినిమాలు చేస్తున్నా కాబట్టి ఇంకో రెండు సినిమాలు హిందీలో చేయగలను. ఇండియన్ స్టార్ కావడం నా లక్ష్యం. ఏదో ఒక భాషకే పరిమితం కావాలను కోవట్లేదు. నన్ను ఎవరు యాక్సెప్ట్ చేస్తే, అక్కడ సినిమాలు చేయాలనుకుంటున్నా’’ అని పూజాహెగ్డే అన్నారు. అల్లు అర్జున్, పూజాహెగ్డే జంటగా త్రివిక్రమ్ తెరకెక్కించిన చిత్రం ‘అల.. వైకుంఠపురములో..’. అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ (చినబాబు) నిర్మించిన ఈ సినిమా ఆదివారం విడుదలైంది. ఈ సందర్భంగా పూజాహెగ్డే విలేకరులతో పంచుకున్న విశేషాలు... ►స్క్రిప్ట్ బాగా నచ్చడం, నాది బలమైన పాత్ర కావడంతో ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నా. త్రివిక్రమ్ గారి నుంచి ఓర్పుగా ఉండటం నేర్చుకున్నా. ఆయనకు అహం లేదు. ►బన్ని, నేను ఇప్పటికి రెండు సినిమాలు చేశాం. దాంతో మా మధ్య సెట్స్‌లో కంఫర్ట్ లెవల్ పెరిగింది. అది తెరపై కెమిస్ట్రీ రూపంలో కనిపించింది. అందుకే మామధ్య కెమిస్ట్రీ బాగుందని అందరూ అంటున్నారు. అందువల్లేనేమో నాతో మూడోసారి నటించాలని ఉందని అల్లు అర్జున్ అన్నారు. ►ఈ చిత్రంలోని అమూల్య పాత్రతో నేను మరింతగా తెలుగమ్మాయిని అయిపోయాను. బాలీవుడ్ జనాలు నన్ను హైదరాబాద్ అమ్మాయిననే అనుకుంటున్నారు. నా పాత్రకు నేను డబ్బింగ్ చెప్పుకోవడం వల్ల నా నటన మరింత ఎలివేట్ కావడానికి ఉపయోగపడుతోంది. తెలుగు నేర్చుకోవడానికి ట్యూటర్ని పెట్టుకోలేదు. నా మేనేజర్‌తో, నా స్టాఫ్‌తో తెలుగులోనే మాట్లాడుతాను. ఇంటర్వ్యూల్లో తెలుగులో మాట్లాడాలంటేనే కొంచెం భయంగా ఉంటుంది. ►ఏదైనా మనం చేసే దృష్టిలో ఉంటుంది. ఈ సినిమాలో హీరోయిన్ కాళ్లను హీరో పదే పదే చూస్తుంటాడు. అలా చూడ్డం వల్గర్‌గా ఏమీ లేదు. అలా ఎందుకు చూస్తాడో.. సినిమా చూస్తే అర్థమౌతుంది. ఈ సన్నివేశాలను జస్టిఫై చేశాం. ►‘అరవింద సమేత’ చిత్రానికి కూడా నేనే డబ్బింగ్ చెప్పుకున్నా. మన పాత్రకి డబ్బింగ్ ఆర్టిస్ట్ చెప్పడం వల్ల ఒక్కోసారి మనం ఓవర్ యాక్టింగ్ చేసినట్లు అనిపిస్తుంది.. అలాంటి నటన నాకిష్టం ఉండదు. కొంతమంది మన నటనను తమ డబ్బింగ్‌తో మరింత ఎలివేట్ చేస్తారు. వాళ్లను నేను గౌరవిస్తాను. ►‘అల.. వైకుంఠపురములో..’ సినిమాలో ‘బుట్టబొమ్మ..’ సాంగ్ లీడ్ సీన్ అంటే నాకు చాలా ఇష్టం. అలాగే బోర్డ్ రూమ్ సన్నివేశం కూడా ఇష్టం. ఆ రెండూ చాలా సరదాగా ఉంటాయి. ►హిందీ ‘హౌస్ ఫుల్ 4’ చిత్రంలో నేను చేసింది సెకండ్ హీరోయిన్ రోల్ కాదు. సగం అక్షయ్ కుమార్‌తో, సగం రితేశ్ దేశ్ముఖ్తో చేశాను. నేను అప్పటి దాకా స్లాప్ స్టిక్ కామెడీ చెయ్యలేదు.. ఆ సినిమా చెయ్యడం గొప్ప అనుభవం. ఆ అనుభవం ‘అల.. వైకుంఠపురములో..’ చిత్రానికి ఉపయోగపడింది. సీన్లో పది మంది పెద్ద ఆర్టిస్టులు ఉన్నప్పుడు మన పాత్రను ఎలా రక్తి కట్టించాలనేది ఆ సినిమాతో నేర్చుకున్నా. ►హిందీలో నేను చేస్తున్నవేవీ సెకండ్ హీరోయిన్ రోల్స్ కావు. 2019లో నేను చేసిన పాత్రల్ని ప్రేక్షకులు బాగా ఆదరించారు. అవన్నీ ఒకదానికొకటి భిన్నమైన పాత్రలు. ‘గద్దలకొండ గణేశ్’లో నన్ను శ్రీదేవిలాగా అంగీకరించారు. ‘మహర్షి’లో కాలేజ్ స్టూడెంట్‌గా, కార్పొరేట్ గాళ్‌గా ఆదరించారు. ఇప్పుడు ‘అల.. వైకుంఠపురములో..’ సినిమాలో బన్నీ బాస్ రోల్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ఇలా వైవిధ్యమైన పాత్రల్లో ప్రేక్షకులు నన్ను ఒప్పుకోవడం సంతోషం.. అందుకు నా పర్సనాలిటీ నా బలమని నమ్ముతాను. ►తెలుగులో లేడీ ఓరియంటెడ్ స్క్రిప్ట్ వచ్చింది కానీ, ఒప్పుకోలేదు. కథ నాకు నచ్చి, చేయగలననిపిస్తే చేస్తా. అలాంటి సినిమాలు ఒక నటిగా నన్ను మరో కోణంలో చూపిస్తాయి. -
నిను చూసి ఆగగలనా!
అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘అల...వైకుంఠపురములో..’. త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. ఈ సినిమాలోని ‘సామజవరగమన.. నిను చూసి ఆగగలనా?’ లిరికల్ వీడియోను శనివారం విడుదల చేశారు. ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి ఈ పాటను రాశారు. తమన్ సంగీతం అందించగా సిద్ధ్ శ్రీరామ్ ఆలపించారు. ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి మాట్లాడుతూ– ‘‘కుర్రతనం.. తుంటరితనం.. కొంటెతనం ఉండే పాట రాయమని అడిగినప్పుడు కొన్ని క్లాసికల్ పదాలు రాయాలనిపించింది. అవకాశం ఇచ్చిన త్రివిక్రమ్‌కు థ్యాంక్స్. బన్నీ ఏ పాత్రలో అయినా చక్కగా ఒదిగిపోగలడు. తమన్ మంచి సంగీతం అందించారు. శ్రీరామ్ బాగా పాడారు’’ అన్నారు. ‘‘బన్నీకి ఇప్పటివరకు 12 పాటలకు వర్క్ చేశాను. ఈ సారి కొత్తగా ఉండాలని ఈ పాటను రెడీ చేశాం. శాస్త్రిగారు అద్భుతమైన లిరిక్స్ ఇచ్చారు’’ అన్నారు తమన్. జనవరి 12న చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఈ సినిమాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: పీడీవీ ప్రసాద్. -
అరవిందతో చిందేయంగా...
వీర రాఘవ తన కోపాన్ని వీడి కూల్ అయ్యారట. ఫైట్స్‌కి ఫుల్స్టాప్ పెట్టి అరవింద సమేతంగా చిందేస్తున్నారట. ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘అరవింద సమేత వీర రాఘవ’. ఇందులో పూజా హెగ్డే కథానాయిక. హారికా హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై యస్. రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం టాకీ పార్ట్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిందని సమాచారం. ప్రస్తుతం సాంగ్స్ షూట్ చేస్తున్నారు. ఎన్టీఆర్, పూజా హెగ్డేలపై ఓ డ్యాన్స్ నంబర్ చిత్రీకరణ జరుగుతోంది. పాటల షూటింగ్‌తో సినిమా కంప్లీట్ అవుతుంది. జగపతిబాబు, ఈషా రెబ్బా, నాగబాబు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. అక్టోబర్ 10న రిలీజ్ కానున్న ఈ చిత్రానికి సంగీతం: యస్.యస్. తమన్, కెమెరా: పీయస్ వినోద్. -
అప్పుడు నాకు అండగా ఉన్నది మీరు.. త్రివిక్రమ్
‘‘నా లోపల హృదయ వైశాల్యం ఎంత ఉంటుందంటే అభిమానించే అందర్నీ గుండెల్లో పెట్టుకోవాలనుంటుంది. నేను సినిమాల్లోకి వచ్చినప్పుడు ఇంత అభిమానాన్ని సంపాదిస్తానని అనుకోలేదు’’ అని పవన్ కల్యాణ్ అన్నారు. పవన్ కల్యాణ్, కీర్తీ సురేశ్, అను ఇమ్మాన్యుయేల్ హీరో హీరోయిన్లుగా త్రివిక్రమ్ దర్శకత్వంలో మమత సమర్పణలో ఎస్. రాధాకృష్ణ (చినబాబు) నిర్మించిన సినిమా ‘అజ్ఞాతవాసి’. అనిరు«ద్ స్వరపరచిన ఈ సినిమా పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. చిత్రాన్ని జనవరి 10న రిలీజ్ చేయాలనుకుంటున్నారు. పవన్ కల్యాణ్ మాట్లాడుతూ– ‘‘నేను సినిమాల్లోకి వస్తున్నప్పుడు మా ఇంట్లో వాళ్లు ఎన్ని సినిమాలు చేస్తావంటే 10 లేక 12 అనుకున్నా. ‘ఖుషి’ తర్వాత వెళ్లిపోదామనుకున్నా. మీ (అభిమానులు) ప్రేమ నన్ను పాతిక సినిమాల వరకూ తీసుకొచ్చింది. జీవితంలో ఓటమికి భయపడలేదు.. గెలుపుకి పొంగిపోలేదు. ‘జానీ’ ఫెయిలయ్యాక నా శ్రేయోభిలాషులు, సన్నిహితులు నాకు అండగా నిలవకున్నా నన్నింకా సినిమాల్లో ఉండనిచ్చింది మీరే . భారతీయ జెండా చూసినప్పుడల్లా నా గుండె ఉప్పొంగుతూ ఉంటుంది. ఆ జెండా, దేశం కోసం నేను రాజకీయాల్లోకి వెళ్లానే కానీ వేరే ఏదీ కాదు. నేను నిరాశ, నిస్పృహల్లో ఉన్నప్పుడు స్నేహితులు, హితులు నాకు చేయూతగా నిలబడలేదు. ‘గోకులంలో సీత’ చిత్రంలో ఓ రచయితగా పని చేసిన త్రివిక్రమ్, మీరు నాకు తోడుగా ఉన్నారు. దర్శకుడిగా ‘జల్సా’ సినిమాతో నాకు హిట్ ఇచ్చారు. అందరూ అంటుంటారు. త్రివిక్రమ్ మీకు బ్యాక్ సపోర్ట్ అట కదా? అని. నేను, త్రివిక్రమ్ దిగువ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చినవాళ్లం. మా ఇద్దరి ఆలోచనా విధానం ఒకటే. నా రక్తం పంచుకుని పుట్టినవారిపై నేనెప్పుడూ కోప్పడలేదు. కానీ, త్రివిక్రమ్‌ని కోప్పడగలను. అంత చనువు ఉంది. ‘జల్సా’ టైమ్‌లో నేను దుఃఖంలోనే ఉన్నా. ‘నా దేశం నా ప్రజలు’ పుస్తకం తెచ్చి ఇచ్చారు త్రివిక్రమ్. అది నాలో స్ఫూర్తి నింపింది. నా మీద తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ సంపాదించుకోవాలనుకుంటారు నిర్మాతలు. కానీ, రాధాకృష్ణగారు సినిమాకి ఎంత కావాలో అంత ఖర్చు పెట్టారు. మైఖేల్ జాక్సన్ తర్వాత నాకిష్టమైన సంగీత దర్శకుడు అనిరు«ద్’’ అన్నారు. త్రివిక్రమ్ మాట్లాడుతూ– ‘‘నేను రూపాయి సరిపోతుందంటే రూపాయిన్నర ఖర్చు పెడదామంటారు రాధాకృష్ణగారు. పీడీ ప్రసాద్‌గారు, నాగవంశీ ఈ సినిమాకి రథ చక్రాల్లా పనిచేశారు. పవన్‌గారు ఇటలీలో ఉన్నప్పుడు ఈ కథని ఫోనులో రెండు నిమిషాలు చెప్పా. ‘చాలా బాగుంది.. చేస్తున్నాం’ అన్నారు. అప్పటినుంచి ఇప్పటివరకూ కథ అడగలేదు. నేను చెప్పినట్టు చేసుకుంటూ పోయారు. కల్యాణ్‌గారి నట విశ్వరూపం చూస్తారు. ఆయనతో పనిచేసే అవకాశం మళ్లీ మళ్లీ రావాలి. మీరందరూ కోరుకుంటున్న ఆ స్థాయికి ఆయన ఎదగాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నా’’ అన్నారు. పాటల రచయిత ‘సిరివెన్నెల’ సీతారామ శాస్త్రి, నిర్మాతలు ఏయం రత్నం, భగవాన్, పుల్లారావు, ‘దిల్’ రాజు తదితరులు పాల్గొన్నారు. -
మూడో ప్రయత్నం అయినా ఫలిస్తుందా..?
ప్రస్తుతం సౌత్ ఫిలిం ఇండస్ట్రీ స్టార్ సంగీత దర్శకుల లిస్ట్‌లో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు అనిరుధ్ రవిచంద్రన్. కొలవర్రీ పాటతో నేషనల్ లెవల్ గుర్తింపు తెచ్చుకున్న అనిరుద్ కోలీవుడ్‌లో స్టార్ హీరోల సినిమాలతో ఆకట్టుకుంటున్నాడు. వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న అనిరుధ్ చాలా కాలంగా టాలీవుడ్ ఎంట్రీ కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. రామ్ చరణ్ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన బ్రూస్లీ సినిమాతోనే అనిరుధ్ టాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వాల్సి ఉన్నా.., కుదరలేదు. తరువాత త్రివిక్రమ్, నితిన్‌ల కాంబినేషన్లో రూపొందిన 'అ..ఆ..' సినిమాతో అనిరుధ్ టాలీవుడ్ ఎంట్రీ కన్ఫామ్ అయ్యింది. అనిరుధ్ పేరుతో పోస్టర్లు కూడా రిలీజ్ అయ్యాయి. కానీ సగం షూటింగ్ అయిన తరువాత అనిరుధ్ స్థానంలో మిక్కీ జే మేయర్‌ను తీసుకున్నారు. అయితే తాజాగా మరోసారి టాలీవుడ్ ఎంట్రీ కోసం ప్రయత్నాలు ప్రారంభించాడు అనిరుధ్. పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కించబోయే కొత్త సినిమాకు అనిరుధ్ మ్యూజిక్ చేసే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతానికి చర్చల దశలో ఉన్న ఈ కాంబినేషన్ అయినా సెట్స్ మీదకు వస్తుందేమో చూడాలి.