ఎన్టీఆర్
వీర రాఘవ తన కోపాన్ని వీడి కూల్ అయ్యారట. ఫైట్స్‌కి ఫుల్‌స్టాప్ పెట్టి అరవింద సమేతంగా చిందేస్తున్నారట. ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘అరవింద సమేత వీర రాఘవ’. ఇందులో పూజా హెగ్డే కథానాయిక. హారికా హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై యస్. రాధాకృష్ణ నిర్మిస్తున్నారు.
ఈ చిత్రం టాకీ పార్ట్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిందని సమాచారం. ప్రస్తుతం సాంగ్స్ షూట్ చేస్తున్నారు. ఎన్టీఆర్, పూజా హెగ్డేలపై ఓ డ్యాన్స్ నంబర్ చిత్రీకరణ జరుగుతోంది. పాటల షూటింగ్‌తో సినిమా కంప్లీట్ అవుతుంది. జగపతిబాబు, ఈషా రెబ్బా, నాగబాబు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. అక్టోబర్ 10న రిలీజ్ కానున్న ఈ చిత్రానికి సంగీతం: యస్.యస్. తమన్, కెమెరా: పీయస్ వినోద్.
Comments
Please login to add a commentAdd a comment