ఆ రెండు చిత్రాలకు సీక్వెల్స్ చేయాలని ఉంది! | Allu arjun and Surender Reddy on Race Gurram Sequel | Sakshi
Sakshi News home page

ఆ రెండు చిత్రాలకు సీక్వెల్స్ చేయాలని ఉంది!

Published Mon, Aug 24 2015 12:08 AM | Last Updated on Sun, Sep 3 2017 8:00 AM

ఆ రెండు చిత్రాలకు సీక్వెల్స్ చేయాలని ఉంది!

ఆ రెండు చిత్రాలకు సీక్వెల్స్ చేయాలని ఉంది!

‘‘రామ్‌చరణ్ తో సినిమా చేయడానికి కథ సిద్ధం చేసుకుంటుండగా కళ్యాణ్‌రామ్‌గారు నాతో  సినిమా చేద్దామనుకున్నారు. అలా ‘కిక్-2’ స్టార్ట్ అయింది’’ అని దర్శకుడు సురేందర్ రెడ్డి చెప్పారు. రవితేజ, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో నందమూరి కల్యాణ్‌రామ్ నిర్మించిన  ‘కిక్-2’ చిత్రం ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి మంచి స్పందన లభిస్తోందని ఆదివారం పాత్రికేయులతో అన్నారు సురేందర్ రెడ్డి. మరికొన్ని విశేషాలను ఆయన చెబుతూ - ‘‘‘కిక్’ తండ్రి కథ, ఇది కొడుకు కధ కాబట్టి ‘కిక్-2’ అని డిసైడయ్యాం. షూటింగ్ త్వరగా పూర్తయినా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌కి ఎక్కువ టైమ్ పట్టింది.
 
 ఈలోపు ‘బాహుబలి’ విడుదల కావడంతో, మా సినిమా విడుదలకు కొంత గ్యాప్ తీసుకున్నాం. బడ్జెట్ ఎక్కువైందనే వార్తలు వినిపిస్తున్నాయి. వాటిలో నిజం లేదు. ఈ చిత్రం విడుదలైన మొదటి రోజు నుంచీ మంచి రెస్పాన్స్ వస్తోంది. మీడియాలో ఏవేవో వార్తలు వస్తుంటాయి. వాటిని పెద్దగా పట్టించుకోను. అయితే ద్వితీయార్ధంలో నిడివి ఎక్కువగా ఉందని కామెంట్లు వినిపించాయి. అందుకే కొన్ని సీన్స్ ట్రిమ్ చేశాం. అన్నీ కుదిరితే ‘కిక్-2’, ‘రేసుగుర్రం’ సినిమాలకు సీక్వెల్స్ తీస్తాను. రామ్‌చరణ్‌తో చేయబోయే చిత్రానికి కోన వెంకట్ కథ చెడీ చేశారు. త్వరలో ఆ కథను రామ్‌చరణ్‌కు వినిపించబోతున్నాను. ఓ ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేయాలని ఉంది. బాండ్ తరహా చిత్రాలంటే నాకు చాలా ఇష్టం. అలాంటి చిత్రాలు కూడా చేయాలని ఉంది’’ అని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement