కోలీవుడ్‌లో అమలాపాల్‌ మలయాళ చిత్రం | Amalapal Dhanush is playing the lead in the forthcoming VIP-2 movie. | Sakshi
Sakshi News home page

కోలీవుడ్‌లో అమలాపాల్‌ మలయాళ చిత్రం

Published Thu, Jul 27 2017 2:20 AM | Last Updated on Tue, Sep 5 2017 4:56 PM

కోలీవుడ్‌లో అమలాపాల్‌ మలయాళ చిత్రం

కోలీవుడ్‌లో అమలాపాల్‌ మలయాళ చిత్రం

తమిళసినిమా: అమలాపాల్‌ నాయకిగా నటించిన మలయాళ చిత్రం కోలీవుడ్‌లో విడుదలకు సిద్ధం అవుతోంది. సంచలన నటిమణుల్లో ముందుండే నటి అమలాపాల్‌ అని అనవచ్చు. వివాహానికి ముందు, విడాకుల తరువాత కూడా నటిగా ఈ అమ్మడికి కథానాయకిగా అవకాశాలు ఏమాత్రం తగ్గలేదు. తమిళంలో ధనుష్‌కు జంటగా నటించిన వీఐపీ–2 చిత్రం త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. మరో పక్క బాబీసింహాతో తిరుట్టుప్పయలే–2 చిత్రంలో నటిస్తోంది. దీనితో పాటు మాతృగడ్డపై నవీన్‌బాలితో రొమాన్స్‌ చేసిన కాయంకుళం కోచ్‌కన్ని చిత్రం విడుదలకు ముస్తాబవుతోంది.

ఇంతకు ముందు మలయాళంలో పళసీరాజా వంటి పలు భారీ చిత్రాలను నిర్మించిన చిత్ర నిర్మాణ సంస్థ గోకులం మూవీస్‌. చాలా ఏళ్లుగా చెన్నైలో గోకులం సిట్‌ సంస్థను నిర్వహిస్తున్న ఈ సంస్థ నటుడు కమలహాసన్‌ స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న శభాష్‌నాయుడు చిత్ర నిర్మాణంలోనూ భాగం పంచుకుంటోంది. జ్యోతిక కథానాయకిగా 36 వయదినిలే వంటి పలు విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన రోషన్‌ ఆండ్రూస్‌ తాజా చిత్రం కాయంకుళం కోచ్‌కన్ని. చాలా ఏళ్ల క్రితం కేరళలో రాబిన్‌హుడ్‌లా జీవించిన కాయంకుళం కోచ్‌కన్ని అనే వ్యక్తి జీవిత ఇతివృత్తంతో తెరకెక్కిన ఈ చిత్రంతో నివిన్‌బాలితో కలిసి అమలాపాల్‌ నటించింది. ఈ చిత్రం సెప్టెంబర్‌లో మలయాళం, తమిళ భాషల్లో విడుదలకు రెడీ అవుతోందని చిత్ర వర్గాలు వెల్లడించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement