బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ అమితాబ్ బచ్చన్ వరుస గా వార్తల్లో వ్యక్తి అవుతున్నారు. అమితాబ్ ట్విటర్ అకౌంట్ హ్యాక్ అయి 24 గంటలు కూడా గడవక ముందే మరో వార్త బిగ్ బి అభిమానులను కలవర పెట్టింది. గత సంవత్సర కాలంగా తన వ్యక్తిగత మొబైల్ ఫోన్ కు అభ్యంత్రకర సందేశాలు వస్తున్నాయంటూ ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు బిగ్ బి. తనకు వచ్చిన సందేశాల వివరాలను కూడా పోలీసులకు అందించినట్టుగా అమితాబ్ తన ట్విటర్ ద్వారా అభిమానులకు తెలియజేశారు.
అమితాబ్ ట్విటర్ హ్యాకింగ్, మొబైల్ మెసేజ్ లు రావటం వెనక ఉన్న వ్యక్తుల గురించి ఆరాతీసే పనిలో ఉన్నారు ముంబై పోలీసులు. గతంలో కూడా చాలా మంది సెలబ్రిటీలు ఇలా ఆకతాయిల తో ఇబ్బంది పడ్డారు. సాంకేతిక అభివృద్ది చెందుతున్న కొద్ది ఇలాంటి సమస్యలు కూడా అదే స్దాయిలో పెరుగుతున్నాయి. అయితే బిగ్ బి లాంటి లెజెండరీ యాక్టర్ కు కూడా ఈ సమస్య ఎదురవ్వటం బాధాకరం.
అభ్యంతరకర సందేశాలపై బిగ్ బి ఫిర్యాదు
Published Tue, Sep 1 2015 10:30 AM | Last Updated on Tue, Oct 2 2018 6:54 PM
Advertisement
Advertisement