'బాహుబలి'కి ఆ ఇద్దరంటే చాలా ఇష్టం! | Amitabh Bachchan, Rajamouli my favourite creative people, says Prabhas | Sakshi
Sakshi News home page

'బాహుబలి'కి ఆ ఇద్దరంటే చాలా ఇష్టం!

Published Wed, May 11 2016 3:18 PM | Last Updated on Sun, Sep 3 2017 11:53 PM

'బాహుబలి'కి ఆ ఇద్దరంటే చాలా ఇష్టం!

'బాహుబలి'కి ఆ ఇద్దరంటే చాలా ఇష్టం!

'బాహుబలి' చిత్రంతో దేశవ్యాప్తంగా స్టార్‌ హీరోగా మారిపోయాడు ప్రభాస్‌. ఆయనకు 'బాహుబలి' దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి, బిగ్‌ బీ అమితాబ్ బచ్చన్‌ అంటే చాలా ఇష్టం. వారిద్దరూ ఇటీవల ఒకేసారి జాతీయ అవార్డులు అందుకోవడం.. ఆ సమయంలో ఆ ఇద్దరు  ఒకే వేదిక మీద కనిపించడం కన్నులపండువగా ఉందని, ఎంతో ఆనందంగా ఉందని తబ్బిబ్బవుతున్నాడు ప్రభాస్‌.

ఇటీవల ప్రకటించిన 63వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో 'బాహుబలి'కిగాను రాజమౌళి ఉత్తమ చిత్రం అవార్డు గెలుపొందగా, 'పీకూ'లో నటనకు ఉత్తమ నటుడిగా అమితాబ్‌ పురస్కారాన్ని గెలుపొందారు. ఈ విషయమై తాజాగా ప్రభాస్ స్పందిస్తూ 'నా ఫేవరెట్‌ క్రియేటివ్ వ్యక్తులైన రాజమౌళి సర్‌ను, అమితాబ్‌ సర్‌ను ఒకే వేదికపై చూడటం ఎంతో కన్నులపండువగా అనిపించింది. ఆ ఇద్దరు ఎంతో స్ఫూర్తినిచ్చారు' అని అన్నాడు.

త్వరలో రానున్న 'బాహుబలి' పార్ట్‌-2 సినిమా కోసం ప్రభాస్ బిజీగా ఉన్నాడు. ఇక, ప్రతిష్టాత్మకమైన కేన్స్‌ చిత్రోత్సవంలో ఓ ప్యానెల్ చర్చకు ఈ చిత్ర దర్శక నిర్మాతలైన రాజమౌళి, శోభూ యార్లగడ్డ నేతృత్వం వహించనున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఈ చిత్రోత్సవంలో 'బాహుబలి' సినిమాను ప్రదర్శించనున్నారు.   

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement