ట్విటర్‌కు అమితాబ్‌ వార్నింగ్‌ | Amitabh Bachchan Threatens To Leave Twitter | Sakshi
Sakshi News home page

Published Thu, Feb 1 2018 11:31 AM | Last Updated on Mon, May 28 2018 3:50 PM

Amitabh Bachchan - Sakshi

అమితాబ్‌ బచ్చన్‌

బాలీవుడ్ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్ సోషల్ మీడియా వెబ్‌సైట్‌ ట్విటర్‌కు వార్నింగ్‌ ఇచ్చారు. ఈ మేరకు ఆయన బుధవారం రాత్రి ఓ ట్వీట్ చేశారు. ‘ట్విటర్‌??? నా ఫాలోవర్ల సంఖ్యను తగ్గించావు.. ఇది హాస్యాస్పదంగా ఉంది. ఇక నీ నుంచి బయటకు వచ్చే సమయం వచ్చింది. బయట మరింత ఆసక్తికర విషయాలు చాలా ఉన్నాయి. థ్యాంక్యూ’ అంటూ ట్వీట్‌ చేశారు అమితాబ్‌. ఈ ట్వీట్‌ తరువాత బిగ్ బి ఇంతవరకు మరో ట్వీట్ చేయలేదు.

ట్విటర్‌ లో అత్యధిక ఫాలోవర్స్‌ ఉన్న సెలబ్రిటీగా ఇన్నాళ్లు తొలి స్థానంలో ఉన్నారు అమితాబ్‌. అమితాబ్ ట్విటర్‌ ఫాలోవర్ల సంఖ‍్య 32,902,353. ఇప్పుడు అమితాబ్‌ ను షారూఖ్‌ దాటేశారు. 32,944,338 ఫాలోవర్స్‌ తో షారూఖ్‌ఖాన్‌ తొలి స్థానంలో నిలిచారు. దీంతో ట్విటర్‌ ఉద్దేశపూర్వకంగానే తన ఫాలోవర్స్‌ను తగ్గించిందన్నట్టుగా అమితాబ్‌ ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం అమితాబ్‌ 102 నాటౌట్‌,     థగ్స్‌ ఆఫ్‌ హిందుస్థాన్‌ సినిమాలతో పాటు తెలుగులో సైరా నరిసింహారెడ్డి సినిమాలో నటిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement