న్యూఢిల్లీ: సామాజిక మాధ్యమం ట్విటర్‌లో బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ తన హవా కొనసాగిస్తున్నారు. ఈ ఏడాది ట్విటర్‌లో ఆయనే అగ్రస్థానంలో నిలిచారు. నటీమణుల్లో సొనాక్షి సిన్హా టాప్‌లో ఉన్నారు. 2019లో సినిమా రంగం నుంచి ప్రముఖుల ట్విటర్ హేండిల్ టాప్-10 జాబితాను ట్విటర్ ఇండియా ప్రకటించింది. నటుల్లో అమితాబ్ తర్వాత అక్షయ్‌కుమార్, సల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్ ఉన్నారు. తమిళ హీరో విజయ్ 5వ స్థానంలో నిలిచారు. తెలుగు హీరో మహేష్‌బాబు 9వ స్థానం దక్కించుకున్నారు. ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ 6, హీరో రణ్‌వీర్ సింగ్ 7, అజయ్ దేవగన్ 8 స్థానాల్లో ఉన్నారు. తమిళ దర్శకుడు అట్లీ 10వ స్థానం దక్కించుకోవడం విశేషం. ఇక మహిళా ప్రముఖుల్లో సొనాక్షి తర్వాత అనుష్క శర్మ, లతా మంగేష్కర్, అర్చనా కల్పతి, ప్రియాంకా చోప్రా ఉన్నారు. అలియా భట్(6), కాజల్ అగర్వాల్(7), సన్నీ లియోన్(8), మాధురి దీక్షిత్(9), రకుల్‌ప్రీత్ సింగ్(10) టాప్‌టెన్‌లో చోటు దక్కించుకున్నారు.
#ThisHappened2019 హాష్‌ట్యాగ్‌తో ఈ ఏడాదిలో ఎక్కువగా ట్వీట్ చేసిన వారి జాబితాను విడుదల చేసింది. సినిమా, క్రీడలు, రాజకీయాలు, ప్రభుత్వ రంగాలకు చెందిన ప్రముఖుల్లో ఎవరి గురించి ఎక్కువగా ట్వీట్లు వచ్చాయనే దాని ఆధారంగా ఈ జాబితాలు ప్రకటించింది. రాజకీయాల్లో ప్రధాని నరేంద్ర మోదీ, క్రీడల్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి టాప్‌లో నిలిచినట్టు ట్విటర్ ఇండియా ప్రకటించింది. (‘గోల్డెన్ ట్వీట్ ఆఫ్ 2019’ ఇదే.. )
And these men were the most Tweeted handles in entertainment #ThisHappened2019 pic.twitter.com/PFL92ThJg9
— Twitter India (@TwitterIndia) December 10, 2019
Comments
Please login to add a commentAdd a comment