twitter handle
-
జార్ఖండ్ కాంగ్రెస్ ‘ఎక్స్’ ఖాతా నిలిపివేత
న్యూఢిల్లీ, సాక్షి: జార్ఖండ్ కాంగ్రెస్ ఖాతాను ‘ఎక్స్’ (ట్విటర్) నిలిపివేసింది. చట్టపరమైన డిమాండ్‌కు ప్రతిస్పందనగా ఎక్స్ ఈ చర్య తీసుకున్నట్లు వార్తా సంస్థ ఏఎస్ఐ నివేదించింది. ఈ హ్యాండిల్‌పై కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు సంబంధించిన 'డీప్‌ఫేక్ మార్ఫ్డ్ వీడియో' పోస్ట్ చేసిన తర్వాత ఖాతాను ‘ఎక్స్’ నిలిపివేసింది.మరోవైపు జార్ఖండ్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజేష్ ఠాకూర్‌కు ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్ బుధవారం తెల్లవారుజామున సీఆర్పీసీ సెక్షన్ 91 కింద నోటీసు జారీ చేసింది. మే 2న సెల్ కార్యాలయంలో హాజరు కావాలని కోరింది. ‘ఢిల్లీ పోలీసుల నుండి నోటీసు అందింది. కానీ నాకు ఎందుకు నోటీసు ఇచ్చారో అర్థం కాలేదు. ఇది అరాచకం తప్ప మరొకటి కాదు’ అని ఠాకూర్ స్పందించినట్లుగా పీటీఐ పేర్కొంది. -
అమితాబ్ ఫస్ట్.. టాప్-10లో మహేష్
న్యూఢిల్లీ: సామాజిక మాధ్యమం ట్విటర్లో బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ తన హవా కొనసాగిస్తున్నారు. ఈ ఏడాది ట్విటర్లో ఆయనే అగ్రస్థానంలో నిలిచారు. నటీమణుల్లో సొనాక్షి సిన్హా టాప్‌లో ఉన్నారు. 2019లో సినిమా రంగం నుంచి ప్రముఖుల ట్విటర్ హేండిల్ టాప్-10 జాబితాను ట్విటర్ ఇండియా ప్రకటించింది. నటుల్లో అమితాబ్ తర్వాత అక్షయ్‌కుమార్, సల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్ ఉన్నారు. తమిళ హీరో విజయ్ 5వ స్థానంలో నిలిచారు. తెలుగు హీరో మహేష్‌బాబు 9వ స్థానం దక్కించుకున్నారు. ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ 6, హీరో రణ్వీర్ సింగ్ 7, అజయ్ దేవగన్ 8 స్థానాల్లో ఉన్నారు. తమిళ దర్శకుడు అట్లీ 10వ స్థానం దక్కించుకోవడం విశేషం. ఇక మహిళా ప్రముఖుల్లో సొనాక్షి తర్వాత అనుష్క శర్మ, లతా మంగేష్కర్, అర్చనా కల్పతి, ప్రియాంకా చోప్రా ఉన్నారు. అలియా భట్(6), కాజల్ అగర్వాల్(7), సన్నీ లియోన్(8), మాధురి దీక్షిత్(9), రకుల్‌ప్రీత్ సింగ్(10) టాప్‌టెన్‌లో చోటు దక్కించుకున్నారు. #ThisHappened2019 హాష్‌ట్యాగ్‌తో ఈ ఏడాదిలో ఎక్కువగా ట్వీట్ చేసిన వారి జాబితాను విడుదల చేసింది. సినిమా, క్రీడలు, రాజకీయాలు, ప్రభుత్వ రంగాలకు చెందిన ప్రముఖుల్లో ఎవరి గురించి ఎక్కువగా ట్వీట్లు వచ్చాయనే దాని ఆధారంగా ఈ జాబితాలు ప్రకటించింది. రాజకీయాల్లో ప్రధాని నరేంద్ర మోదీ, క్రీడల్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి టాప్‌లో నిలిచినట్టు ట్విటర్ ఇండియా ప్రకటించింది. (‘గోల్డెన్ ట్వీట్ ఆఫ్ 2019’ ఇదే.. ) And these men were the most Tweeted handles in entertainment #ThisHappened2019 pic.twitter.com/PFL92ThJg9 — Twitter India (@TwitterIndia) December 10, 2019 -
‘కట్టా న్యూస్’తో ఎందుకు సంచలనం!
సాక్షి, న్యూఢిల్లీ : మహారాష్ట్ర రాజకీయాలకు సంబంధించిన సంచలన పరిణామాలను అందరికన్నా ముందు ‘కట్టా న్యూస్’ వెల్లడించి సంచలనం సృష్టించింది. నవంబర్ 18వ తేదీన ఏర్పడిన ఈ ‘కట్టా న్యూస్’ 20వ తేదీన ఎన్సీపీ నుంచి అజిత్ పవార్ నాయకత్వాన ఓ వర్గం చీలిపోయి బీజేపీతో చేతులు కలపనుందని వార్తను వెల్లడించి తొలి సంచలనానికి శ్రీకారం చుట్టింది. అజిత్‌కు నచ్చచెప్పలేక పోతున్నానంటూ శరద్ పవార్ అసహనం వ్యక్తం చేసినట్లు కూడా ఆయన వెల్లడించారు. ఆ తర్వాత మూడు రోజులకు తెల్లవారుజామున దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా, అజిత్ సింగ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారంతో మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం కొలువు తీరిందంటూ కట్టా న్యూస్ వార్తను ప్రచురించి మరో సంచలనం సృష్టించింది. 24వ తేదీన 70 వేల నీటి పారుదల కుంభకోణంలో అజిత్ పవార్‌కు ఏసీబీ క్లీన్ చిట్ ఇచ్చిందంటూ మరో ‘బ్రేకింగ్’ న్యూస్ ఇచ్చింది. ఈ మూడు పరిణామాలను వెల్లడించడంలో ప్రధాన మీడియా వెనకపడింది. ప్రధాన మీడియా నాడికి అందని రాజకీయ పరిణామాలను ఎప్పటికప్పుడు ప్రజల ముందుకు తీసుకొచ్చిన ‘కట్టా న్యూస్’కు జేజేలు అంటూ ప్రముఖ రాజకీయ నాయకులు, సామాజిక కార్యకర్తలు కట్టా న్యూస్‌ను నడుపుతున్న సీనియర్ జర్నలిస్ట్ సుధీర్ సూర్యవంశీకి అభినందనలు తెలిపారు. కట్టా న్యూస్ ఎవరిది? కట్టా న్యూస్ వెబ్సైట్ కాదు, వెబ్ పోర్టల్ అంతకంటే కాదు. ట్విటర్లో ఏర్పాటైన ఓ వేదిక. దీన్ని నిర్వహిస్తున్న సుధీర్ ట్వీట్ల ద్వారానే మహారాష్ట్ర రాజకీయ పరిణామాలను ఎప్పటికప్పుడు తెలియజేశారు. ముంబైకి చెందిన ఆయన ఇంతకుముందు ఢిల్లీ నుంచి వెలువడే ‘డీఎన్ఏ’ పత్రికలో రిపోర్టర్‌గా పనిచేశారు. ఆ పత్రిక గత అక్టోబర్ నెలలో మూత పడడంతో ఆయన రోడ్డున పడ్డారు. పత్రికా జర్నలిజంలో 15 ఏళ్ల అనుభం కలిగిన సుధీర్ రాజకీయాలు, రియల్ ఎస్టేట్, వ్యవసాయం రంగాలకు సంబంధించి జీన్యూస్, ముంబై మిర్రర్‌కు వ్యాసాలు రాశారు. ముకేశ్ అంబానీ తన ముంబైలోని ఆంటిలియా నివాసంలోకి అడుగుపెట్టిన మొదటి నెలలో ఆయన ఎలక్ట్రిసిటీ బిల్లు 70 లక్షల రూపాయలంటూ ఓ సంచలన వార్తను కూడా అప్పట్లో ఆయన రాశారు. డీఎన్ఏ మూతపడగానే సొంతంగా పోర్టల్‌గానీ, వెబ్‌సైట్‌గానీ ఏర్పాటు చేయాలని సుధీర్ భావించారు. ఆ ప్రయత్నాల్లో ఉండగానే మహారాష్ట్ర రాజకీయాలు అనూహ్య మలుపులు తిరుగుతుండడంతో ‘కట్టా న్యూస్’ ఏర్పాటు చేశారట. కట్టా అంటే మరాఠీ భాషలో వార్తా విశేషాలు తెలుసుకునేందుకు ప్రజలంతా ఓ చోట గుమి కూడడం. తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు వార్తలు తెలుసుకునేందుకు పంచాయతీ కార్యాలయాల ముందు గుమికూడేవారు. అమ్ముడు పోయిన ప్రధాన మీడియా నేడు ప్రధాన మీడియా రాజకీయ పార్టీలకు అమ్ముడు పోవడం వల్ల ఎప్పటికప్పుడు ప్రజలకు వాస్తవాలు తెలియజేసేందుకు చిన్న మీడియా ద్వారానైనా ప్రజలకు తనలాంటి వాళ్ల అవసరం ఉందని సుధీర్ ‘ఆల్ట్‌న్యూస్’తో వ్యాఖ్యానించారు. మహారాష్ట్రకు సంబంధించి ఆయన వెల్లడించిన పరిణామాలన్నీ బీజేపీకి సంబంధించినవే. ఉద్దేశ పూర్వకంగా ఎవరో ఆయనకు ఈ వార్తలను అందించి ఉంటారు. ఆయన నిజాయితీగా ఈ వార్తలను అందించినట్లయితే, నవంబర్ 22వ తేదీ అర్ధరాత్రి ప్రధాని నరేంద్ర మోదీ తన విశేషాధికారాలను ఉపయోగించి మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనను రద్దు చేస్తూ రాష్ట్రపతి భవన్‌కు ఉత్తర్వులు పంపడం, ఆ ఉత్తర్వులను స్వీకరించిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయకుండా, తక్షణమే ఉత్తర్వులను అమలు చేయాల్సిందిగా మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీకి అదే రోజు తెల్లవారు జామున పంపించడం, ఆయన ఆగమేఘాల మీద ఫడ్నవీస్‌ను పిలిపించడం లాంటి పరిణామాలను ఎప్పటికప్పుడు ఎందుకు తెలియజేయలేదు?! -
ఆ హీరోయిన్‌కు సైబర్ షాక్
ముంబై : బాలీవుడ్ సెలబ్రిటీలు పలువురు సైబర్ ఉచ్చులో చిక్కుకుపోతున్నారు. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచన్, షాహిద్ కపూర్, అద్నాన్ సమీల తర్వాత తాజాగా నటి అమృతా రావు తన ట్విటర్ ఖాతా హ్యాకింగ్‌కు గురైందని వెల్లడించారు. ప్రముఖ మీడియా సంస్ధ నుంచి వచ్చిన లింక్ ద్వారా ట్విటర్ ఖాతా హ్యాకైందని ఆమె పేర్కొన్నారు. వారం రోజుల కిందట తన ట్విటర్ అకౌంట్ హ్యాకైందని చెబుతూ ఇటీవల తనకు ఓ ప్రముఖ మీడియా సంస్థ నుంచి మెసేజ్ వచ్చిందని, తన ఇంటర్వ్యూ కోసం అనుమతి కోరుతూ వచ్చిన ఆ మెయిల్‌ను తన సోషల్ మీడియా టీమ్ క్లిక్ చేయగానే ట్విటర్ ఖాతా హ్యాకింగ్‌కు గురైందని అమృతా రావు చెప్పారు. దీంతో తనకు వెంటనే గతంలో అమితాబ్ బచన్ అకౌంట్ హ్యాక్ అయిన ఉదంతం గుర్తుకువచ్చిందని, పరిశ్రమకు ఇది ఒక ప్రమాదకర ధోరణిగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో తనకు తుషార్ కపూర్ ట్విటర్ ఖాతా నుంచి మెసేజ్ రాగా, ఆయన తన అకౌంట్ హ్యాక్ అయిందని చెప్పారని అమృత గుర్తుచేశారు. -
పన్నీర్ సెల్వానికి అనూహ్య మద్దతు!
తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వానికి అనుకోని రూపంలో గట్టి మద్దతు దొరికింది. అన్నాడీఎంకేకు చెందిన ఐటీ విభాగం ఆయనకు దన్నుగా నిలిచింది. దాంతోపాటు సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే మరికొందరు కూడా అనుక్షణం ఓపీఎస్‌కు అండగా ఉంటూ ట్వీట్లు, పోస్టింగులతో హోరెత్తిస్తున్నారు. మరోవైపు శశికళ క్యాంపులో ఉన్న ఎమ్మెల్యేల ఆచూకీ తెలియడం లేదని, వాళ్లంతా అదృశ్యం అయ్యారని పీఎంకే న్యాయవాది బాలు మద్రాస్ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సుమోటోగా హెబియస్ కార్పస్ పిటిషన్ వేయాలని కోరారు. అదే జరిగితే ప్రస్తుతం క్యాంపు రాజకీయాలు నడుపుతున్న శశికళకు పెద్ద ఎదురుదెబ్బే అవుతుంది. అన్నాడీఎంకే అధికారిక ఐటీ విభాగంలో కీలకంగా వ్యవహరించే హరి ప్రభాకరన్, శ్రీరామ్ తదితరులు పన్నీర్ సెల్వానికి అనుకూలంగా ట్వీట్లు మోతెక్కిస్తున్నారు. తాజాగా మొత్తం ఎమ్మెల్యేలందరి ఫోన్ నంబర్ల జాబితాను ట్వీట్ చేస్తూ.. పన్నీర్ సెల్వానికి మద్దతు ఇవ్వాల్సిందిగా వాళ్లకు సందేశాలు పంపాలని ప్రజలను కోరుతున్నారు. తాను ఓపీఎస్‌కు పూర్తి మద్దతు చెబుతున్నానని, మిగిలినవాళ్లు కూడా అలాగే చేయాలని హరిప్రభాకరన్ తెలిపారు. కాగా ఐటీ విభాగం, ఇతరులు ట్విట్టర్లో పోస్ట్ చేసిన ఎమ్మెల్యేల నంబర్లు భారీగా షేర్ అయ్యాయి. దాంతో ఆ జాబితాలో ఉన్న ఎమ్మెల్యేలందరికీ ఫోన్లు, మెసేజిలు విపరీతంగా వెళ్తున్నాయని తెలుస్తోంది. శశికళ క్యాంపు నుంచి 26 మంది ఎమ్మెల్యేలు బయటకు వచ్చేశారని, వాళ్లంతా పన్నీర్‌కు మద్దతు పలుకుతున్నారని ట్వీట్లలో చెబుతున్నారు. మిగిలినవాళ్లు కూడా ఎక్కడున్నా అందరూ ఆయనకు మద్దతుగా ఓటేయాలని పిలుపునిస్తున్నారు. దీంతో షాక్ తిన్న శశికళ వర్గం.. తమ ఐటీ విభాగం అధినేత సింగై జి రామచంద్రన్‌ను తొలగించి, ఆయన స్థానంలో వీవీఆర్ రాజ్ సత్యంను నియమించింది. కానీ అప్పటికే పరిస్థితి చేయి దాటిపోయింది. సోషల్ మీడియాలో పన్నీర్ సెల్వం హీరోగా మారిపోయారు. People Versus Sasi War. Register your protest peacefully with your ADMK MLAs. Here is the list with their numbers. SUPPORT OPS. RT Please.. pic.twitter.com/cxyaVKDJQF — SriramMADRAS (@SriramMadras) 8 February 2017 ADMK MLA List 1/5. People register your peaceful protest. Support OPS in this war against Sasikala. Retweet please pic.twitter.com/BWJ6FNIRfa — SriramMADRAS (@SriramMadras) 8 February 2017 ADMK MLAs who have escaped the luxury bus trip moving to OPS side. OPS side soon: 26. With OPS, MLAs are at liberty to live a normal life :) — SriramMADRAS (@SriramMadras) 9 February 2017 Sources: OPS & team officially set to touch 26 MLAs. Other MLAs remain unreachable for now & their locations unknown. Few are Ministers too — SriramMADRAS (@SriramMadras) 9 February 2017 If you feel tat decision taken by #OPS s right,take a min, call orTxt ur MLA. All i could do is to create a platform to pass on voice of TN pic.twitter.com/UHDuclVTG6 — Hari Prabhakaran (@Hariadmk) 8 February 2017 -
రాహుల్ గాంధీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అధికారిక ట్విట్టర్ అకౌంట్ బుధవారం హ్యాక్ అయింది. రాహుల్ అకౌంట్‌ను హ్యాక్ చేసిన హ్యాకర్లు అసభ్యకరమైన పోస్టులు పెట్టారు. రాహుల్ గాంధీని, అయన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకొని హ్యాకర్లు ఇష్టానుసారంగా పోస్టులు చేశారు. రాహుల్ గాంధీ ట్విట్టర్ అకౌంట్ నుంచి సదరు ట్విట్లను తొలగించారు. హ్యాకర్లు పోస్టు చేసిన ట్విట్లు: