అమిరాదస్తూరికో అవకాశం | Amyra Dastur in CV Kumar movie | Sakshi
Sakshi News home page

అమిరాదస్తూరికో అవకాశం

Published Sat, Oct 31 2015 2:10 AM | Last Updated on Mon, Apr 8 2019 7:50 PM

అమిరాదస్తూరికో అవకాశం - Sakshi

అమిరాదస్తూరికో అవకాశం

అమిరా దస్తూరి గుర్తుందా? ఇష్క్ చిత్రంతో బాలీవుడ్‌లో మెరిసిన ఈ బ్యూటీ కోలీవుడ్‌లో అనేగన్ చిత్రంతో దిగుమతి అయ్యారు. ధనుష్ సరసన నటించిన ఆ చిత్రం విజయం సాధించినా ఆ తరువాత ఆ ముంబాయి భామ మళ్లీ తమిళ తె రపై కనిపించలేదు. చాలా మంది అదే ఈ అమ్మడి ఆఖరి తమిళ చిత్రం అనుకున్నారు. అలాంటిది ఇప్పుడీ అమ్మడు ప్రముఖ నిర్మాత సీవీ.కుమార్ దృష్టిలో పడింది. తాను తొలిసారిగా మెగాఫోన్ పట్టనున్న చిత్రంలో అమిరాదస్తూరిని నాయకిగా ఎంచుకున్నారు. ఇంకొంచెం వివరంగా చెప్పాలంటే అట్టకత్తి, పిజ్జా, ముండాసిపట్టి, సూదుకవ్వుమ్,తెకిడి, ఇండ్రు నేట్రు నాళై వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన పీవీ.కుమార్ కు దర్శకత్వంపై ఆశ పుట్టింది.

మాయావన్ అనే చిత్రాన్ని తెర కెక్కించే ప్రయత్నంలో ఉన్నారు. ఇది థ్రిల్లర్ కథా చిత్రం. ఇందులో సందీప్ కిషన్ కథానాయకుడిగా నటించనున్నారు. అయితే ఆయనకు జంటగా నటించే నాయకి గురించే చాలా కష్ట పడాల్సి వచ్చిందని సమాచారం. కీర్తీసురేశ్, లావణ్య త్రిపాటి లాంటి వారిని నటింపజేయాలనే ప్రయత్నం జరిగినా అది వర్క్‌అవుట్ కాలేదు.

దీంతో ముంబాయి ముద్దుగుమ్మ అమిరా దస్తూరి సీవీ.కుమార్ దృష్టిలో పడింది. ఆమె కూడా రాక రాక వచ్చిన ఈ కోలీవుడ్ అవకాశాన్ని లబక్కన పట్టుకుందట. చిత్ర షూటింగ్ దీపావళి తరువాత ప్రారంభించనున్నారు. అంతకుముందు 10 రోజుల పాటు నటీనటులకు రిహార్సల్స్ నిర్వహించనున్నారట. దీనికోసం అమిరా నవంబర్‌లో చెన్నైకి రానుందని తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement