ఐ లవ్‌ యు.. ఎవడ్రా నువ్వు | anaganaga o prema katha teaser released | Sakshi
Sakshi News home page

ఐ లవ్‌ యు.. ఎవడ్రా నువ్వు

Published Mon, Sep 24 2018 4:35 AM | Last Updated on Mon, Sep 24 2018 4:54 AM

anaganaga o prema katha teaser released - Sakshi

విరాజ్‌ జె.అశ్విన్, రిద్ధి కుమార్‌

‘ఐ లవ్‌ యు సూర్య’, ఎవరమ్మా ఆ సూర్య?, ‘నాకు ఊహ వచ్చినప్పటి నుండి నాకు తెలిసిన ప్రేమ ఒకటి మా నాన్న.. రెండు నువ్వు, ఐ లవ్‌ యు.. ఎవడ్రా నువ్వు?’ వంటి డైలాగులు ‘అనగనగా ఓ ప్రేమకథ’ టీజర్‌లో అలరిస్తున్నాయి. ప్రముఖ ఎడిటర్‌ మార్తాండ్‌. కె. వెంకటేశ్‌ మేనల్లుడు విరాజ్‌ జె.అశ్విన్‌ హీరోగా, రిద్ధి కుమార్, రాధా బంగారు హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘అనగనగా ఓ ప్రేమకథ’. డైరెక్టర్‌ ఎన్‌. శంకర్‌ వద్ద అసోసియేట్‌గా పనిచేసిన టి.ప్రతాప్‌ ఈ చిత్రంతో  దర్శకునిగా పరిచయం అవుతున్నారు.

ప్రముఖ నిర్మాత డీవీఎస్‌ రాజు అల్లుడు కె.ఎల్‌.ఎన్‌ రాజు నిర్మించిన ఈ సినిమా టీజర్‌ని హీరో రానా దగ్గుబాటి విడుదల చేశారు. దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘వైవిధ్యమైన కథతో తెరకెక్కిన చిత్రమిది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. అక్టోబర్‌లో సినిమాను విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ‘‘రానాగారు నా తొలి చిత్రం టీజర్‌ను విడుదల చేయటం ఎంతో ఆనందంగా ఉంది’’ అన్నారు విరాజ్‌ జె.అశ్విన్‌. ఈ చిత్రానికి సంగీతం: కె.సి.అంజన్, కెమెరా: ఎదురొలు రాజు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement