థౌజండ్ లైట్స్ మీడియా బ్యానర్‌పై ప్రతాప్ తాతంశెట్టిని దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కిస్తున్న సినిమా అనగనగా ఓ ప్రేమకథ. ఈ సినిమాతో ప్రముఖ ఎడిటర్ మార్తండ్ కే వెంకటేష్ మేనల్లుడు విరాజ్ కె అశ్విన్ హీరోగా పరిచయం అవుతున్నాడు. ఇప్పటికే షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది.
ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్ రేపు(శుక్రవారం) ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేయనున్నారు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ చేతుల మీదుగా సెప్టెంబర్ 7 సాయంత్రం 4 గంటలకు చిత్ర ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి త్వరలోనే సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
Published Thu, Sep 6 2018 3:27 PM | Last Updated on Thu, Sep 6 2018 3:27 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment