
అనన్యా పాండే.. డాటర్ ఆఫ్ చంకీ పాండే తెలుగు తెరకు పరిచయం కాబోతున్న విషయం తెలిసిందే. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ప్యాన్ ఇండియన్ మూవీ ‘ఫైటర్’లో విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్‌గా నటిస్తున్నారు అనన్య. ‘‘ఈ చిత్రంలో నా క్యారెక్టర్ నా రియల్ లైఫ్ క్యారెక్టర్‌లానే ఉంటుంది. అమ్మాయిలందరూ ఈ సినిమాలోని నా పాత్రకు కనెక్ట్ అవుతారు’’ అన్నారు అనన్యా పాండే. ఈ సినిమా ఒప్పుకునేవరకూ ఈ బ్యూటీకి తెలుగు రాదు. ఇప్పుడు కొన్ని కొన్ని పదాలు వచ్చట.
(చదవండి : విజయ్ దేవరకొండతో బాలీవుడ్ బ్యూటీ)
‘‘ప్రతి రోజూ ఈ చిత్రం షూటింగ్‌లో కొన్ని తెలుగు పదాలు నేర్చుకోవాలని నా అంతట నేను ఒక రూల్ పెట్టుకున్నాను. అలాగే నేర్చుకుంటున్నాను. నా పాత్రకు నేనే డబ్బింగ్ చెప్పుకోవాలనుకుంటున్నాను. తెలుగులో మాత్రమే కాదు.. ఏ భాషలో సినిమా చేస్తే ఆ భాషలో డబ్బింగ్ చెప్పుకోవాలని ఉంది. మరి చూడాలి’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment