సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘ఫైటర్’.. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో చేయబోయే ఫైట్స్ కోసం విజయ్ థాయ్‌లాండ్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. ఇప్పటికే ముంబైలో తొలి షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకున్నట్టు టాక్. అయితే ఈ సినిమాపై సెట్స్‌పైకి వెళ్లిన హీరోయిన్, ఇతర తారాగణం విషయంలో చిత్ర యూనిట్ ఎలాంటి క్లారిటీని ఇవ్వలేదు. తాజాగా ఈ సినిమాలో విజయ్ సరసన ఆడిపాడేదే ఎవరో పూరి బృందం అధికారికంగా ప్రకటించింది.‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’ సినిమాతో హిందీ తెరకు పరిచయమైన అనన్య పాండేను ‘ఫైటర్’కథానాయికగా నటిస్తున్నట్లు తెలిపింది. తొలుత జాన్వి కపూర్‌తో చిత్ర బృందం చర్చలు జరిపినప్పటికీ కుదరలేదు. దీంతో చివరికి అనన్య పాండేను ఫైనల్ చేశారు.
కాగా, ఇప్పటికే సినిమా సెట్‌లో అనన్య అడుగుపెట్టింది. దీనికి సంబంధించిన ఫోటోలను కూడా చిత్ర బృందం సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘సాహో’ సినిమాలో విలన్ పాత్రలో నటించిన చుంకీ పాండే కూతురే అనన్య పాండే అన్న విషయం తెలిసిందే. ‘వరల్డ్ ఫేమస్ లవర్’ ఫలితం తీవ్రంగా నిరాశపరచడంతో ‘ఫైటర్’పైనే విజయ్ దేవరకొండ భారీ ఆశలు పెట్టుకున్నాడు. ‘ఇస్మార్ శంకర్’సూపర్ డూపర్ హిట్‌తో తిరిగి ఫామ్‌లోకి వచ్చిన పూరి.. ఇదే జోష్‌లో ‘ఫైటర్’తోనూ మరో భారీ సక్సెస్ కొట్టాలని పూరి అండ్ గ్యాంగ్ భావిస్తోందట. అంతేకాకుండా పూరి జగన్నాథ్ ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తుండగా.. హిందీ వెర్షన్‌కు కరణ్ జోహార్ భాగస్వామిగా వ్యవహరించనున్నట్టుగా తెలుస్తోంది.
చదవండి:
విలన్‌గా యాంకర్ అనసూయ..!
‘వరల్డ్ ఫేమస్ లవర్’ మూవీ రివ్యూ
Comments
Please login to add a commentAdd a comment