జబర్థాస్త్ లాంటి షోలతో బుల్లితెర మీద హాట్ యాంకర్ ఇమేజ్ సొంతం చేసుకున్న అనసూయ చాలా రోజులుగా వెండితెర మీద సత్తా చాటేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ అయితేనే చేస్తానంటూ పవన్ కళ్యాణ్ సరసన స్పెషల్ సాంగ్ వదులుకున్న ఈ బ్యూటీ, తరువాత తన రేంజ్ ఏంటో తెలుసుకొని స్పెషల్ సాంగ్స్కు సై అంటోంది.
అదే సమయంలో క్షణం, సోగ్గాడే చిన్నినాయనా లాంటి సినిమాలు అనసూయకు వెండితెర మీద కూడా మంచి ఇమేజ్ తెచ్చిపెట్టాయి. లీడ్ రోల్స్ కాకపోయినా.. స్పెషల్ క్యారెక్టర్స్కు అనసూయ బెస్ట్ ఛాయిస్ అని ఫీల్ అవుతున్నారు టాలీవుడ్ మేకర్స్. అదే బాటలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది అనసూయ.
సోగ్గాడే చిన్నినాయనా సినిమాలో పల్లెటూరి అమ్మాయిగా కనిపించిన అనసూయ, పూర్తి విలేజ్ బ్యాక్డ్రాప్లో తెరకెక్కుతున్న రామ్ చరణ్ సుకుమార్ సినిమాలోనూ అదే తరహా పాత్రలో కనిపించనుందట. ప్రస్తుతానికి అఫీషియల్ ఎనౌన్స్మెంట్ లేకపోయినా.. చరణ్ సినిమాలో అనసూయ నటిస్తుందన్న టాక్ టాలీవుడ్ సర్కిల్స్లో గట్టిగానే వినిపిస్తోంది.