జై మాహిష్మతి | And the National award is here!! Jai Mahishmathi!! | Sakshi
Sakshi News home page

జై మాహిష్మతి

Published Mon, Mar 28 2016 1:17 PM | Last Updated on Sun, Jul 14 2019 4:05 PM

జై మాహిష్మతి - Sakshi

జై మాహిష్మతి

హైదరాబాద్: రికార్డులను కొల్లగొట్టడంలో అప్రతిహతంగా దూసుకుపోతున్న టాలీవుడ్ సెన్సేషనల్ మూవీ 'బాహుబలి' కిరీటంలో మరో కలికితురాయి వచ్చి చేరిన సందర్భంగా సోషల్ మీడియాలో అభినందనలు వెల్లువెత్తాయి. ఆ చారిత్రక  సినిమాలో ప్రధాన భూమికను పోషించిన నటుడు దగ్గుబాటి రానా ట్విట్టర్‌లో స్పందించారు. సినిమా జాతీయ అవార్డు సాధించడంపై తన  సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. ''జై మాహిష్మతి... థాంక్యూ'' అని కామెంట్ పోస్ట్ చేశారు.

పచ్చబొట్టు పాటతో ఆకట్టుకున్న మిల్కీ బ్యూటీ తమన్నా  స్పందిస్తూ  అవార్డు పట్ల  సంతోషం వ్యక్తం చేస్తూ,  తమ తోటి బృందానికి అభినందనలు  తెలిపారు. మరోవైపు  బాహుబలి సినిమాతో అసోసియేట్ అయినందుకు గర్వంగా ఉందని   బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహార్   ట్విట్ చేశారు.   ఇది  నిజంగా ఉత్తమ చిత్రమంటూ కొనియాడారు.

 

టాలీవుడ్ జక్కన్న చెక్కిన బాహుబలి విజయంపై పలువురు సినీ ప్రముఖులు, విమర్శకులు, నటీనటులు చిత్ర యూనిట్‌ను ప్రశంసల్లో ముంచెత్తుతూ ట్వీట్ చేశారు. ఇది తెలుగు సినిమాకు లభించిన గొప్ప విజయమని టాలీవుడ్ హీరో  జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. దర్శకుడు రాజమౌళికి, చిత్ర యూనిట్ కు అభినందనలు తెలిపారు  తారక్.  గర్వంతో పొంగిపోయేలా చేసిన రాజమౌళికి అభినందనలు  తెలిపారు టాలీవుడ్ మన్మధుడు హీరో అక్కినేని నాగార్జున.


వీర‌త్వానికి, ధీర‌త్వానికి నెలవైన, సువిశాల సుసంపన్నరాజ్యం మాహిష్మతి. ఈ రాజ్యంలో అధికారాన్ని హస్తగతం చేసుకోవడానికి జరిగే కుట్రలు, ఎత్తులు, యుద్ధాల కథాంశంతో టాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కినదే బాహుబలి.. దీని  సీక్వెల్‌గా  బాహుబలి 2  షూటింగ్ దశలో ఉన్న సంగతి తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement