మా మధ్య గొడవలున్నట్టు రాశారు: రాజమౌళి | Some sites report a tiff between me and Samantha, says Rajamouli | Sakshi
Sakshi News home page

మా మధ్య గొడవలున్నట్టు రాశారు: రాజమౌళి

Published Mon, Jul 14 2014 9:03 AM | Last Updated on Sat, Sep 2 2017 10:17 AM

Some sites report a tiff between me and Samantha, says Rajamouli

తనకు, హీరోయిన్ సమంతకు మధ్య గొడవలున్నట్టు కొన్ని వెబ్సైట్లు వార్తలు రాశాయని.. ఇందులో వాస్తవం లేదని దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి పేర్కొన్నారు. ట్విటర్ లో తన పోస్టింగ్స్ ను ఆధారంగా చేసుకుని ఈ వార్తలు రాశారని వెల్లడించారు. తాను సరదాగా ఆ వ్యాఖ్యలు చేశానని వివరణయిచ్చారు. ఇది అర్థం చేసుకోకుండా తమ మధ్య స్పర్థలు ఉన్నట్టు రాశారని ట్విటర్ లో పేర్కొన్నారు. ఇలాంటి వార్తలను పట్టించుకోవద్దని కోరారు.

 

'బాహుబలి'లో ప్రత్యేక పాత్ర కోసం సమంతను తాను స్వయంగా అడిగితే ఆమె నిరాకరించందని రాజమౌళి అంతకుముందు ట్విట్ చేశారు. డేట్స్ ఖాళీ లేకపోవడం వల్లే రాజమౌళి ఆఫర్ ను సమంత నిరాకరించింది. దీంతో 'నీ అభిమానులు నా మీద కోపగించుకునేలా చేశావు' అంటూ రాజమౌళి సరదాగా ట్వీట్ చేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement