'తొమ్మిదేళ్ల విరామం తరువాత'
ఈ ఏడాది జాతీయ అవార్డుల పట్టికలో అండవ కానోమ్ చిత్రం కచ్చితంగా చోటు చేసుకుంటుందనే నమ్మకాన్ని ఆ చిత్ర నిర్మాతల్లో ఒకరైన జె.సతీష్‌కుమార్ వ్యక్తం చేశారు. లియోవిజన్ సంస్థ రాజ్‌కుమార్, జేఎస్‌కే.ఫిలిం కార్పొరేషన్ సతీష్‌కుమార్ కలిసి నిర్మిస్తున్న చిత్రం అండవ కానోమ్. వేల్‌మది దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నటి శ్రేయారెడ్డి ప్రధాన పాత్రను పోషించారు.
విజయ్‌సేతుపతి కీలక పాత్రలో నటించిన ఈ చిత్రానికి అశ్వమిత్ర సంగీతాన్ని అందించారు.ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం సాయంత్రం చెన్నై సాలిగ్రామంలోని ప్రసాద్‌ల్యాబ్‌లో జరిగింది. నటి శ్రేయారెడ్డి మాట్లాడుతూ సుమారు తొమ్మిదేళ్ల తరువాత తాను నటించిన చిత్రం అండవ కానోమ్ అన్నారు. దర్శకుడు ఇది మీ కెరీర్‌లో చాలా మంచి చిత్రంగా నిలిచిపోతుందన్నారన్నారు.
షూటింగ్ స్పాట్‌లో పక్కన కూర్చుని మదురై ప్రజల జీవన విధానాన్ని చాలా వివరంగా తెలిపారన్నారు. జేఎస్‌కే లేకుంటే ఈ చిత్రం విడుదలయ్యే అవకాశం లేదని శ్రేయారెడ్డి అన్నారు. జె.సతీష్‌కుమార్ మాట్లాడుతూ దర్శకుడు వేల్‌మది తన వద్ద ఒక గ్రామీణ కథ ఉంది, 300 మందిని నటింపజేసి చిత్రాన్ని తెరకెక్కిస్తానని చెప్పారన్నారు. ఈ కథ చెప్పగానే ఇందులో నటించమని మొదట అడింగింది నటి శ్రేయారెడ్డినేనని తెలిపారు.
తన అంచనాలు కరెక్ట్‌గా అయితే అండవ కానోమ్ చిత్రం ఈ ఏడాది జాతీయ అవార్డుల పట్టికలో చోటు సంపాదించుకుంటుందని అన్నారు. అంతేకాదు ఈ సినిమాను అజిత్ వివేగం సినిమా రిలీజ్ అవుతున్న ఆగస్టు 11నే రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇదే రిస్కే అయినా.. తమ సినిమా విజయం పై చిత్రయూనిట్ నమ్మకంగా ఉన్నామని తెలిపారు.