అంజలీనా మజాకా! | Anjali turns singer with a peppy number in 'Chitrangada' | Sakshi
Sakshi News home page

అంజలీనా మజాకా!

Published Tue, Mar 1 2016 4:17 AM | Last Updated on Wed, Apr 3 2019 9:04 PM

అంజలీనా మజాకా! - Sakshi

అంజలీనా మజాకా!

హీరో అయినా, హీరోయిన్ అయినా ఒక స్థాయి వరకే దర్శక నిర్మాతలకు అణుకువగా నడుచుకుంటారన్న విషయం నటి అంజలి విషయంలో మరోసారి రుజువైంది. నయనతార నటించిన దెయ్యం ఇతివృత్తంతో కూడిన మాయ చిత్రం విజయం సాధించడంతో ఆ తరహా చిత్రాలు మరిన్ని ఆమె ఇంటి ముందు క్యూ కడుతున్నాయి. అయితే నయనతార డిమాండ్ చేస్తున్న పారితోషికం చూసి దర్శక నిర్మాతలకు నోటమాట రావడంలేదు. అలా ఆమెను దృష్టిలో పెట్టుకుని రాసిన కథను దర్శకుడు సర్వేశ్ ఇప్పుడు నటి అంజలితో తెరకెక్కిస్తున్నారు. ఒక పక్క ఇరైవి చిత్రంలో నటిస్తూనే అంజలి ఈ చిత్రం చేస్తున్నారు.

దీనికి కాన్బదు పొయ్ అనే టైటిల్‌ను నిర్ణయించారు. ఈ చిత్రం ఇప్పటికే తొలి షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇటీవల రెండో షెడ్యూల్‌ను కున్నూర్‌లో జరుపుకుంటోంది. తొలిరోజునే అంజలి షూటింగ్ స్పాట్‌కు రాకుండా హోటల్ గదిలోనే కూర్చొని చిత్ర యూనిట్‌కు జర్క్ ఇచ్చారట. ఆ రోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి అర్ధరాత్రి రెండు గంటల వరకూ అంజలిని కాల్‌షీట్స్ అడిగారట.

అందుకు అంగీకరించిన ఆమె మధ్యాహ్నం రెండు గంటలకు రెడీ అయి షూటింగ్ స్పాట్ వెళ్లాలని ప్రయత్నించగా తనకు క్యారవన్ వ్యాన్‌ను కేటాయించకపోవడంతో హోటల్ గదిలోనే ఉండిపోయారు. దీంతో చిత్ర యూనిట్ సాయంత్రానికల్లా అంజలికి క్యారవన్ వ్యాన్ ఏర్పాటు చేయడంతో షూటింగ్‌లో పాల్గొన్నారు. అలా చిన్న చిన్న విషయాలకు కూడా సర్దుకుపోకపోవడంతో చిత్ర యూనిట్ అంజలి విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారట. దీంతో అంజలినా మజాకా అంటున్నారు కోలీవుడ్ వర్గాలు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement