
అన్నాచెల్లెళ్ల అనుబంధంతో మీనా
అమ్మానాన్నా అన్నీ తానై చెల్లెల్ని పెంచే ఓ అన్న, తనకు తోడునీడగా ఉండే అన్న ప్రేమను ఆస్వాదించే ఓ చెల్లి.. ఈ ఇద్దరి మధ్య ఉండే అనుబంధం నేపథ్యంలో సాగే ధారావాహిక ‘మీనా’.
అన్నాచెల్లెళ్ల అనుబంధానికి నిదర్శనంగా నిలిచే ఈ సీరియల్ ఓ ప్రముఖ జాతీయ చానల్‌లో ‘వీరా’గా జనాదరణ పొందడం విశేషమని, తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉందని జీ తెలుగు ప్రతినిధి తెలిపారు. రేపట్నుంచీ జీ తెలుగులో ఈ ధారావాహిక సోమవారం నుంచి శనివారం వరకు సాయంత్రం 5 గంటలకు ప్రసారమవుతుంది.