బిచ్చగాడు నిర్మాతల నుంచి.. పిల్లరాక్షసి
బిచ్చగాడు నిర్మాతల నుంచి.. పిల్లరాక్షసి
Published Wed, Oct 26 2016 5:42 PM | Last Updated on Tue, Jun 4 2019 6:34 PM
`బిచ్చగాడు` లాంటి సెన్సేషనల్ హిట్ చిత్రాన్ని అందించిన శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ పతాకంపై చదలవాడ పద్మావతి అందిస్తున్న మరో చిత్రం `పిల్ల రాక్షసి`. కేవలం రూ. 50 లక్షలతో డబ్బింగ్ రైట్స్ కొనుక్కున్న బిచ్చగాడు సినిమా దాదాపు రూ. 20 కోట్ల వసూళ్లు సాధించి సంచలన విజయం అందించిన విషయం తెలిసిందే. ఇప్పుడు కూడా మళయాళంలో ఘనవిజయం సాధించిన `ఆన్ మరియ కలిప్పిలాను` సినిమా డబ్బింగ్ హక్కులు తీసుకుని, దాన్ని తెలుగులో `పిల్ల రాక్షసి` పేరుతో విడుదల చేస్తున్నారు నిర్మాతలు.
`బిచ్చగాడు` చిత్రానికి తెలుగులో మాటలు, పాటలు అందించిన రచయిత భాషా శ్రీ పిల్లా రాక్షసి సినిమాకు కూడా మాటలు, పాటలు అందించారు. `బిచ్చగాడు` లాంటి హిట్ తర్వాత అదే బ్యానర్‌పై వస్తున్న సినిమా కావడంతో.. దీనిపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల లియోన్ జేమ్స్ సంగీతం అందించిన పాటలకు రెస్పాన్స్ బాగుంది. దర్శకుడు మిథున్ మాన్యూల్ థామస్ డిఫరెంట్ కాన్సెప్ట్‌ను రియలిస్టిక్ పంథాలో ఆవిష్కరించారు. `ఓకే బంగారం` ఫేం దుల్కర్ సల్మాన్ ఓ ముఖ్య అతిథిగా నటించగా, సారా అర్జున్ టైటిల్ పాత్రలో నటించింది. సన్నీ వాయ్‌నే, లియోనా లిషాయ్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుని క్లీన్ యు సర్టిఫికెట్ పొందింది. సినిమాను నవంబర్ 4న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
Advertisement
Advertisement