
ప్రస్తుతం మహర్షి సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న సూపర్‌స్టార్ మహేష్ బాబు త్వరలో తదుపరి చిత్రాన్ని స్టార్ట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఎఫ్ 2 సినిమాతో సూపర్ హిట్ అందుకున్న అనిల్ రావిపూడి దర్శకత్వంలో తన తదుపరి చిత్రాన్ని చేస్తున్నట్టుగా ఇప్పటికే ప్రకటించాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి రోజుకో వార్త టాలీవుడ్ సర్కిల్స్‌లో హల్‌చల్ చేస్తోంది.
కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘సరిలేరు నీకెవ్వరు’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్టుగా చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే తాజాగా మరో ఇంట్రస్టింగ్ టైటిల్ తెర మీదకు వచ్చింది. దిల్ రాజు, అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు ‘రెడ్డిగారి అబ్బాయి’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారట. ఈ విషయంపై చిత్రయూనిట్ ఎలాంటి ప్రకటనా చేయకపోయినా సోషల్ మీడియాలో మాత్రం ఈ వార్త తెగ వైరల్ అవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment