కోహ్లీని పెళ్లాడే ఆలోచన లేదన్న అనుష్క | Anushka Sharma denies wedding plans | Sakshi
Sakshi News home page

కోహ్లీని పెళ్లాడే ఆలోచన లేదన్న అనుష్క

Published Sat, Aug 23 2014 8:59 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

కోహ్లీని పెళ్లాడే ఆలోచన లేదన్న అనుష్క - Sakshi

కోహ్లీని పెళ్లాడే ఆలోచన లేదన్న అనుష్క

ముంబై: భారత క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లీతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న బాలీవుడ్ భామ అనుష్క శర్మ పెళ్లి వార్తలను కొట్టిపారేసింది. కోహ్లీని  పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన అనుష్కకు లేదని ఆమె తరపు ప్రతినిధి వెల్లడించారు.

తాజాగా ఇంగ్లండ్ పర్యటనకు కోహ్లీతో కలసి అనుష్క వెళ్లడం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అనుష్కను పెళ్లి చేసుకుంటానని కోహ్లీ చెప్పడం వల్లే జట్టు బస చేసిన హోటల్లో ఉండటానికి ఆమెను అనుమతించామని బోర్డు పెద్దలు చెప్పారు. అయితే ఇదంతా అవాస్తమని అనుష్క ప్రతినిధి ఓ ప్రకటనలో తెలిపారు. అనుష్క పెళ్లి గురించి పలు వదంతులు ప్రచారంలో ఉన్నాయని అవన్నీ అసత్యమని చెప్పారు. కాగా ఇంగ్లండ్లో విరాట్తో కలసి అనుష్క హోటల్లో బస చేసిన విషయాన్ని ప్రస్తావించలేదు. గతంలో న్యూజిలాండ్ పర్యటనకు కూడా కోహ్లీ అనుష్కను వెంట తీసుకెళ్లాడు. 26 ఏళ్ల అనుష్క.. విరాట్తో కలసి ప్రపంచమంతా తిరిగేస్తోంది కానీ పెళ్లి ఆలోచన మాత్రం లేదంటోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement