ఆ పాత్ర కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నా: అనుష్క | Anushka waiting to dig teeth into 'Sultan' role | Sakshi
Sakshi News home page

ఆ పాత్ర కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నా: అనుష్క

Published Mon, Jan 11 2016 2:16 PM | Last Updated on Sun, Sep 3 2017 3:29 PM

ఆ పాత్ర కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నా: అనుష్క

ఆ పాత్ర కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నా: అనుష్క

సల్మాన్ ఖాన్‌తో కలిసి తాను నటించబోయే సుల్తాన్ సినిమా గురించి ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నట్లు బాలీవుడ్ హీరోయిన్ అనుష్కా శర్మ చెబుతోంది. సల్మాన్‌తో కలిసి పనిచేసేందుకు తాను శిక్షణ తీసుకుంటున్నానని, ఆ సినిమా గురించి.. అందులో తన పాత్ర గురించి ఎంతో ఉత్సుకతగా, ఆతృతగా ఉన్నానని ఆమె చెప్పింది. బ్రిటానియా ఫిలింఫేర్ అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేసింది.

ఇంతకుముందు 'జబ్ తక్ హై జాన్' సినిమాలో షారుక్ సరసన, 'పీకే'లో ఆమిర్ ఖాన్‌తోను నటించిన అనుష్క.. ఇప్పుడు సల్మాన్‌తో కూడా నటించేస్తే తాను పరిపూర్ణం అవుతానని భావిస్తోంది. ఆయనలాంటి పర్సనాలిటీ ఎవరూ ఉండరంటూ సల్లూభాయ్ మీద ప్రశంసలు కురిపించింది. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో వస్తున్న సుల్తాన్ సినిమా.. ఈ ఏడాది ఈద్‌కు విడుదల అవుతుందని భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement