
రుద్రమదేవి ఫస్ట్‌లుక్ రిలీజ్!
ఎప్పుడెప్పుడా అంటూ ప్రేక్షకులు ఎదురు చూస్తున్న రుద్రమదేవి చిత్రం ఫస్ట్‌లుక్‌ను బుధవారం విడుదల చేశారు. కాకతీయ వీరనారి రాణీ రుద్రమదేవి పాత్రలో అనుష్క నటిస్తున్న చిత్రం రుద్రమదేవి. గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం హిస్తారికల్ స్టీచరియోస్కోపిక్ త్రీడీ చిత్రంగా రూపొందుతోంది. భారతీయ సినీ చరిత్రలో కొత్త టెక్నాలజీతో రూపొందుతున్న తొలిచిత్రం.
అనుష్క పుట్టినరోజుని రోజు పురస్కరించుకుని ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా గుణశేఖర్ మీడియా సమావేశంలో నిర్వహించారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ..గత ఏడాది అనుష్క పుట్టిన రోజున ఈ చిత్ర నిర్మాణ కార్యక్రమాలను చేపట్టాం. అనుష్క నటన ఈ చిత్రానికి హైలెట్‌గా నిలుస్తుంది. వచ్చే మార్చికి షూటింగ్ పూర్తవుతుంది అని తెలిపారు.
రానా దగ్గుబాటి హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో ఓ ప్రత్యేక పాత్రను నిత్యామీనన్, మరో పాత్రను కేథరిన్ చేస్తున్నారు. ఇతర ప్రధాన పాత్రలను కృష్ణంరాజు, ప్రకాష్‌రాజ్, సమన్, జయప్రకాష్‌రెడ్డి, ప్రభ తదితరులు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఇళయరాజా.