అందుకే ధైర్యం చేశాం!
అందుకే ధైర్యం చేశాం!
Published Sun, Nov 27 2016 11:20 PM | Last Updated on Mon, Aug 20 2018 3:54 PM
‘‘ప్రస్తుతం ప్రజలు డబ్బు సమస్య ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితుల్లో సినిమా విడుదల చేయాలా? వద్దా? అనుకున్నాం. కానీ, ఇటీవల విడుదలైన చిత్రాల వసూళ్లు బాగుండటం, ముఖ్యంగా ‘అరకు రోడ్‌లో’ చిత్రంపై ఉన్న నమ్మకంతో ధైర్యం చేసి రిలీజ్ చేస్తున్నాం’’ అని హీరో సాయిరామ్ శంకర్ అన్నారు. ఆయన హీరోగా, నికిషా పటేల్ హీరోయిన్‌గా వాసుదేవ్ దర్శకత్వంలో మేకా బాలసుబ్రమణ్యం, బి.భాస్కర్, వేగిరాజు ప్రసాదరాజు, రామేశ్వరి నక్కా నిర్మించిన ఈ చిత్రం డిసెంబరు 2న విడుదల కానుంది. వాసుదేవ్ మాట్లాడుతూ- ‘‘విశాఖ-అరకు ప్రాంతాల్లో నడిచే కామెడీ, యాక్షన్ థ్రిల్లర్ ఇది. పూరీ జగన్నాథ్‌గారికి మా చిత్రం నచ్చడంతో విజయంపై మాకు మరింత నమ్మకం వచ్చింది’’ అన్నారు. ‘‘అన్ని వర్గాలవారికీ నచ్చే విధంగా ఉంటుంది’’ అన్నారు నిర్మాతలు.
Advertisement
Advertisement