‘కమలతో నా ప్రయాణం’
‘కమలతో నా ప్రయాణం’
Published Tue, Sep 24 2013 2:34 AM | Last Updated on Fri, Sep 1 2017 10:59 PM
పడుపు వృత్తి నుంచి బయటపడి, మంచి జీవితాన్ని గడపాలని ఆశించే ఓ వేశ్య కథతో రూపొందుతోన్న చిత్రం ‘కమలతో నా ప్రయాణం’. ‘1940లో ఓ గ్రామం’ చిత్రంతో విమర్శకుల ప్రశంసలందుకున్న దర్శకుడు నరసింహ నంది దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో అర్చన వేశ్యగా నటిస్తున్నారు. శివాజి కథానాయకుడు. ఇసనాక సునిల్‌రెడ్డి, సిద్దార్ధ బోగోలు నిర్మాతలు.
దర్శకుడు మాట్లాడుతూ -‘‘1950 నేపథ్యంలో సాగే పీరియాడికల్ మూవీ ఇది. ప్రేక్షకుల్ని ఆ రోజులకు తీసుకెళుతుందీ సినిమా. వేశ్య వృత్తిలో ఉండే స్త్రీల మనోగతాన్ని అద్భుతంగా ఆవిష్కరించే సినిమా. వాస్తవానికి దగ్గరగా ఇందులోని పాత్రలు ఉంటాయి. ఆద్యంతం వర్షంలోనే ఈ సినిమా సాగడం విశేషం’’ అన్నారు.
‘‘షూటింగ్ పూర్తయ్యింది. అక్టోబర్‌లో పాటలను, నవంబర్‌లో సినిమాను విడుదల చేస్తాం’’ అని నిర్మాతలు చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: ఎస్.మురళీమోహన్‌రెడ్డి, సంగీతం: కిషన్ కవాడియా, పాటలు: మనమాలి, నిర్మాణం: లివిత యూనివర్సల్ ఫిలింస్.
Advertisement