Kamalatho naa prayanam
-
అంతర్జాతీయ చిత్రోత్సవానికి కమలతో...
అమెరికాలోని కాలిఫోర్నియాలో నిర్వహిస్తున్న రివర్సైడ్ అంతర్జాతీయ చిత్రోత్సవానికి నరసింహ నంది దర్శకత్వంలో రూపొందిన ‘కమలతో నా ప్రయణం’ సినిమా ఎంపికైంది. ఈ విషయాన్ని ఆ చిత్ర నిర్మాతలు ఇసనాక సునీల్‌రెడ్డి, సిద్దార్థ్ బాగోలు గురువారం ఓ ప్రకటన ద్వారా తెలిపారు. 1950 నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో శివాజీ, అర్చన ప్రధాన పాత్రలు పోషించారు. ఈ నెల 19 నుంచి ఈ చిత్రోత్సవాలు జరుగనున్నాయని, లాభ నష్టాల గురించి ఆలోచించకుండా ఓ మంచి ఆశయంతో తాము నిర్మించిన ఈ చిత్రానికి ఈ గౌరవం లభించడం ఆనందంగా ఉందని నిర్మాతలు చెప్పారు. -
వేశ్య వృత్తి వద్దనుకునే కమల
వేశ్య వృత్తి నుంచి బయటపడాలని తపించే ఓ స్త్రీ, సమాజాన్ని ఎదిరించైనా సరే వేశ్య వృత్తి నుంచి ఆమెను బయటకు తెచ్చి కొత్త జీవితాన్ని ఇవ్వాలని ఆశించే ఓ వ్యక్తి. ఈ ఇద్దరి కథతో తెరకెక్కిన చిత్రం ‘కమలతో నా ప్రయాణం’. 1950 నాటి యదార్థ సంఘటన ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో శివాజీ, అర్చన జంటగా నటించారు. నరసింహ నంది దర్శకుడు. ఇసనాక సునీల్‌రెడ్డి, బాగోలు సిద్దార్థ్ ఈ చిత్రానికి నిర్మాతలు. ఈ నెల 14న విడుదల కానున్న ఈ చిత్రం గురించి నిర్మాతలు మాట్లాడుతూ -‘‘కథకు ప్రాధాన్యత ఇస్తూ, అందుకు తగ్గ నటీనటులను ఎంచుకొని చేసిన చిత్రమిది. ఓ మంచి సినిమా నిర్మించామనే సంతృప్తినిచ్చిందీ సినిమా. సందర్భానుగుణంగా వచ్చే పాటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి’’ అని తెలిపారు. ‘‘ఇందులోని పాత్రలన్నీ నిజానికి నిలువుటద్దంగా ఉంటాయి. వేశ్య వృత్తితో జీవనం సాగించే కమలగా అర్చన, ఉన్నత భావాలనున్న వ్యక్తిగా శివాజీ, కమలను ఇంట్లో ఉంచుకొని వేశ్య వృత్తి చేయించే శేషమ్మ పాత్రలో పావలా శ్యామల... ఇలా ప్రతి ఒక్కరూ పాత్రలో లీనమై నటించారు. ఈ నెల 14న విడుదలయ్యే ఈ సినిమా తప్పకుండా అందరి మన్ననలూ అందుకుంటుందని నా నమ్మకం’’ అని దర్శకుడు చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: ఎస్.మురళీమోహన్‌రెడ్డి, పాటలు: వనమాలి, కూర్పు: వి.నాగిరెడ్డి, కళ: బాబ్జీ. -
మేఘసందేశం అంత గొప్ప సినిమా కావాలి : దాసరి
‘‘ఈ సినిమా ట్రైలర్స్, పాటలు చూడగానే నాకు పోలవరం గుర్తొచ్చింది. ‘మేఘసందేశం’ అక్కడే తీశాం. ఈ సినిమా కూడా ‘మేఘసందేశం’ అంత గొప్ప సినిమా కావాలి’’ అని దాసరి నారాయణరావు అన్నారు. శివాజీ, అర్చన జంటగా నరసింహ నంది దర్శకత్వంలో ఇసనాక సునీల్‌రెడ్డి, బాగో సిద్దార్థ్ నిర్మించిన చిత్రం ‘కమలతో నా ప్రయాణం’. కిషన్ కవాడియా స్వరాలందించిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. దాసరి ఆడియో సీడీని ఆవిష్కరించి మాజీ స్పీకర్ సురేష్‌రెడ్డికి అందించారు. ‘‘ప్రతి చిన్న సినిమాల ఫంక్షన్లకీ వెళ్తుంటారెందుకు? అని నన్ను పరిశ్రమలో చాలామంది అడుగుతుంటారు. ‘మీరు వెళ్లరు. కాబట్టే నేను వెళుతున్నా’ అని చెబుతాను. స్టార్ అనేవాడి కెరీర్ మొదలయ్యేది చిన్న సినిమాల నుంచే. అందుకే చిన్న సినిమా బాగుండాలని కోరుకుంటా. ఇక ఈ సినిమా విషయానికొస్తే... బూతు సినిమాలు రాజ్యమేలుతున్న ఈ రోజుల్లో సంస్కారవంతమైన చిత్రాన్ని నిర్మించిన నిర్మాతను అభినందిస్తున్నా’’ అని దాసరి చెప్పారు. తన కెరీర్లోనే ఇది చెప్పుకోదగ్గ సినిమా అవుతుందని, అర్చన నటన ‘మేఘసందేశం’లో జయప్రదను గుర్తు చేస్తుందని దర్శకుడు అన్నారు. ‘‘కమలతో నా ప్రయాణం చక్కని సినిమా. టీం అంతా కష్టపడి చేసిన సినిమా. ఎంత గొప్ప సినిమా అయినా ప్రజల్లోకి వెళ్లకపోతే ఆడదు. ఈ సినిమాకు ప్రమోషన్ చాలా అవసరం’’ అని శివాజి చెప్పారు. త్వరలోనే సినిమాను విడుదల చేస్తామని నిర్మాతలు చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: మురళీమోహన్‌రెడ్డి, కూర్పు: వి.నాగిరెడ్డి. -
‘కమలతో నా ప్రయాణం’ సిసిమా స్టిల్స్
-
‘కమలతో నా ప్రయాణం’
పడుపు వృత్తి నుంచి బయటపడి, మంచి జీవితాన్ని గడపాలని ఆశించే ఓ వేశ్య కథతో రూపొందుతోన్న చిత్రం ‘కమలతో నా ప్రయాణం’. ‘1940లో ఓ గ్రామం’ చిత్రంతో విమర్శకుల ప్రశంసలందుకున్న దర్శకుడు నరసింహ నంది దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో అర్చన వేశ్యగా నటిస్తున్నారు. శివాజి కథానాయకుడు. ఇసనాక సునిల్‌రెడ్డి, సిద్దార్ధ బోగోలు నిర్మాతలు. దర్శకుడు మాట్లాడుతూ -‘‘1950 నేపథ్యంలో సాగే పీరియాడికల్ మూవీ ఇది. ప్రేక్షకుల్ని ఆ రోజులకు తీసుకెళుతుందీ సినిమా. వేశ్య వృత్తిలో ఉండే స్త్రీల మనోగతాన్ని అద్భుతంగా ఆవిష్కరించే సినిమా. వాస్తవానికి దగ్గరగా ఇందులోని పాత్రలు ఉంటాయి. ఆద్యంతం వర్షంలోనే ఈ సినిమా సాగడం విశేషం’’ అన్నారు. ‘‘షూటింగ్ పూర్తయ్యింది. అక్టోబర్‌లో పాటలను, నవంబర్‌లో సినిమాను విడుదల చేస్తాం’’ అని నిర్మాతలు చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: ఎస్.మురళీమోహన్‌రెడ్డి, సంగీతం: కిషన్ కవాడియా, పాటలు: మనమాలి, నిర్మాణం: లివిత యూనివర్సల్ ఫిలింస్.