
జనరల్‌గా ఇండియన్ సినిమాలకు హాలీవుడ్ టెక్నీషియన్స్ వర్క్ చేస్తుంటారు. ‘బాహుబలి’, ‘2.0’ వంటి చిత్రాలకు అక్కణ్ణుంచి ఇక్కడికి రప్పించారు. అందుకే ఇండియన్స్ ఎవరైనా హాలీవుడ్ సినిమాలకు పని చేస్తే అదో పెద్ద విషయం. అది కూడా ‘టైటానిక్’, ‘అవతార్’ వంటి అద్భుతాలను సృష్టించిన జేమ్స్ కామెరూన్ వంటి దర్శకుడి సినిమా చేసే చాన్స్ అంటే ఆషామాషీ కాదు. అందుకే ఆశ్రితా కామత్‌ను అందరూ అభినందిస్తున్నారు. అయితే ఆశ్రితాకి ఇది మొదటి హాలీవుడ్ మూవీ కాదు.
ఆల్రెడీ ‘కాంగ్: స్కల్ ఐల్యాండ్’, ‘ఐ సీ యు’, ‘పెసిఫిక్ రిమ్: అప్‌రైజింగ్’ వంటి చిత్రాలకు పని చేశారు. అవన్నీ ఒక ఎల్తైతే ఇప్పుడు ఆమె చేస్తోన్న జేమ్స్ కామెరూన్ ‘అవతార్ 2’ మరో ఎత్తు అనాలి. ప్రతిష్టాత్మక ‘అమెరికన్ ఫిలిం ఇనిస్టిట్యూట్’ నుంచి ప్రొడక్షన్ డిజైన్‌లో ఎంఎఫ్‌ఏ చేశారు ఆశ్రిత. ఆమె చేసిన మొదటి థీసిస్ ఫిల్మ్ ‘ఇంటర్ స్టేట్’ 2014లో 41వ స్టూడెంట్ అకాడమీ అవార్డుల్లో రజత పతకం సాధించింది. ‘డస్ట్ ల్యాండ్’ బెస్ట్ ప్రొడక్షన్ అండ్ ఆర్ట్ డిజైన్ విభాగంలో ఫిలింక్వెస్ట్‌కు నామినేట్ అయింది. ఆశ్రితా తల్లి గ్రాఫిక్ డిజైనర్. కూతురి తొలి గురువు ఆమే. ఓ తెలుగమ్మాయి హాలీవుడ్ సినిమాకి ఆర్ట్ డైరెక్టర్ అవడం గర్వించదగ్గ విషయం. మరి.. తెలుగింటి ఆవకాయా? మజాకా?
Comments
Please login to add a commentAdd a comment