సాక్షి, హైదరాబాద్: ఒకప్పుడు తెలుగు, హిందీ, తమిళ సినిమాల్లో అలరించిన అసిన్ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అసిన్ థొట్టుంకల్, రాహుల్ శర్మ దంపతులు మంగళవారం పాపకు జన్మనిచ్చారు. ’మా జీవితాల్లోకి ఓ చిన్నారి పాప వచ్చిందనే విషయాన్ని తెలిపేందుకు ఎంతో సంతోషిస్తున్నాం. గత తొమ్మిది నెలలు మాకు ఎంతో ప్రత్యేకమైన కాలం. మా శ్రేయోభిలాషులకు, మాపై ప్రేమాభిమానాలు చూపుతున్న అందరికీ కృతజ్ఞతలు’ అని అసిన్-రాహుల్ శర్మ దంపతులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇతర సెలబ్రిటీల తరహాలో అసిన్ తాను ప్రెగ్నెంట్ అయిన విషయాన్ని పెద్దగా వెల్లడించలేదు. గత ఫిబ్రవరి 27న ఇన్‌స్టాగ్రామ్‌లో చివరిపోస్టు పెట్టిన అసిన్ ఆ తర్వాత ఇప్పుడు అకస్మాత్తుగా తాము ఒక బిడ్డకు జన్మనిచ్చామని ప్రకటించడం ఆమె అభిమానులకు సర్‌ప్రైజ్‌తోపాటు సంతోషాన్ని కలుగజేసింది.
’గజనీ’ సినిమాతో ఫేమస్ అయిన అసిన్ 2016 జనవరిలో రాహుల్‌ను పెళ్లాడింది. అసిన్ కూతురు ఫొటో, తన పేరు తెలియాల్సి ఉంది. ఇటీవల బాలీవుడ్‌లో పెళ్లిలు జరగడం, పిల్లలు పుట్టడం నిత్య నూతనంగా కనిపిస్తోంది. హేమామాలిని కూతురు ఇషా డియోల్ ఇటీవల పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. తన కూతురికి రధ్య అని పెట్టినట్టు తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment