రాజీవ్‌గాంధీ హత్య నేపథ్యంలో శ్రీ పెరంబదూర్ | Assassination of rajiv gandhi stroy 'Sriperumbudur' | Sakshi
Sakshi News home page

రాజీవ్‌గాంధీ హత్య నేపథ్యంలో శ్రీ పెరంబదూర్

Published Thu, Oct 17 2013 12:57 AM | Last Updated on Fri, Sep 1 2017 11:41 PM

రాజీవ్‌గాంధీ హత్య నేపథ్యంలో శ్రీ పెరంబదూర్

రాజీవ్‌గాంధీ హత్య నేపథ్యంలో శ్రీ పెరంబదూర్

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ మానవబాంబు చేతిలో ఎలా హతమయ్యారో అందరికీ తెలిసిందే. ఆ దారుణ మారణకాండను, ఆ హత్య వెనుక జరిగిన మహా పన్నాగాలను చాలా రియలస్టిక్‌గా మలయాళంలో తెరకెక్కించారు. మమ్ముట్టి కథానాయకునిగా చేసిన ఆ చిత్రానికి ఫేమస్ డెరైక్టర్ మేజర్ రవి దర్శకత్వం వహించారు. 
 
 ఇప్పుడీ చిత్రం తెలుగులో ‘శ్రీ పెరంబదూర్’ పేరుతో అనువాదమవుతోంది. షేక్ మహమ్మద్ (హుస్సేన్) ఈ సినిమాను కొన్ని మార్పులూ చేర్పులతో తెలుగు ప్రేక్షకులకు అందించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం అనువాద కార్యక్రమాలు జరుగుతున్నాయి. 
 
 ఇటీవలే తెలుగు వెర్షన్ కోసం కొంత రీ షూట్ కూడా చేశారు. రాజకీయాల్ని ఇష్టపడేవారు కాకుండా, సామాన్య ప్రేక్షకులకూ నచ్చేవిధంగా ఈ చిత్రం ఉంటుందని, నవంబరులో సినిమాను విడుదల చేస్తామని హుస్సేన్ తెలిపారు. శ్రీ తిరుమల హోమ్ ట్రేడర్స్ పతాకంపై అనువాదమవుతోన్న ఈ చిత్రానికి సమర్పణ: తేలప్రోలు వీరయ్య చౌదరి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement