Sriperumbudur
-
యాపిల్: వివాదాస్పద ఐఫోన్ ప్లాంట్ మళ్లీ ఓపెన్
యాపిల్ కంపెనీ సప్లయిర్‌గా ఉన్న ఫాక్స్‌కాన్, తమిళనాడులోని వివాదాస్పద ప్లాంట్‌ను తిరిగి తెరిచేందుకు ముహూర్తం ఖరారు చేసుకుంది. జనవరి 12న ఈ ప్లాంట్‌లో తిరిగి కార్యకలాపాలు ప్రారంభించనుందని స్థానిక ప్రజాప్రతినిధితో పాటు అధికారులు సైతం ప్రకటించడం విశేషం. శ్రీ పెరుంబుదూర్‌లో ఉన్న ఈ ఐఫోన్ అసెంబ్లింగ్ సెంటర్ బయట ఉన్న ఓ వసతి గృహంలో ఆహారం కల్తీ కావడంతో సుమారు 159 మంది కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. దీనిపై రోడ్డెక్కిన ఉద్యోగులు భారీ ఎత్తున్న ఆందోళన చేపట్టగా.. ప్లాంట్‌ను తాత్కాలికంగా మూసేస్తున్నట్లు యాపిల్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఫాక్స్‌కాన్‌ను హెచ్చరించినట్లు సమాచారం. అంతేకాదు ప్రమాణాలకు తగ్గట్లు వసతి గృహాలు లేవనే ఆరోపణల్ని సైతం ఒప్పుకుంది. 2021 డిసెంబర్ 18న ఈ ఘటన జరగ్గా.. డిసెంబర్ 30నే తిరిగి ప్లాంట్‌ను తెరవాల్సి ఉంది. అయితే ప్రమాణాలు మెరుగుపర్చడం అనే కారణంతో నిర్ణయాన్ని మరికొంత కాలం వాయిదా వేసింది ఫాక్స్‌కాన్. ఈ లోపు యాజమాన్యాన్ని మార్చడంతో పాటు ఉద్యోగులకు, కార్మికులకు మూతపడిన కాలానికి జీతాలు సైతం చెల్లించింది. ఇదీ చదవండి: ఫ్లైట్ క్యాన్సిల్ అయ్యిందా? ‘ప్లాన్-బి’ ఉందిగా! -
మూడువారాలుగా పోలీస్ స్టేషన్ ఎదుటే..
సాక్షి ప్రతినిధి, చెన్నై: తన యజమానిని పోలీసులు పట్టుకెళ్లడాన్ని అతని పెంపుడు కుక్క తట్టుకోలేకపోయింది. సుమారు 25 కిలోమీటర్లు పోలీసు వాహనం వెంట పరుగెత్తి స్టేషన్ ముందు కాపుకాచింది. యజమాని మాత్రం దయాదాక్షిణ్యం లేకుండా పెంపుడు కుక్కను అనాథగా వదిలేసి వెళ్లిపోవడంతో స్టేషన్ ముందే కూర్చుని యజమాని కోసం మూడువారాలుగా ఎదురుచూస్తుంది. ఈ దయనీయమైన ఘటన ఇటీవల తమిళనాడులో జరిగింది. దారి దోపిడీలు, చోరీల కేసులో చెన్నై మౌంట్ పోలీసులు రెండు వారాల క్రితం ముగ్గురిని అరెస్ట్ చేశారు. శ్రీపెరంబుదూరుకు చెందిన అజయ్(30)పై అనుమానంతో ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అతడిని వ్యాన్‌లోకి ఎక్కించుకోవడాన్ని గమనించిన అతడి పెంపుడు శునకం వాహనాన్ని అనుసరించింది. 12 కిలోమీటర్లు దాటిపోతున్నా శునకం వదలకుండా పరుగెత్తడాన్ని గమనించిన పోలీసులు అజయ్‌ని ప్రశ్నించగా అది తన పెంపుడు కుక్క అని చెప్పాడు. కుక్కను చూసి జాలిపడిన పోలీసులు వాహనాన్ని నిలిపి దాన్ని కూడా లోపలికి ఎక్కించుకున్నారు. విచారణ నిమిత్తం అజయ్‌ను పోలీస్‌స్టేషన్ లోనికి తీసుకెళ్లగా శునకం యజమాని కోసం బయటే వేచివుంది. విచారణ ముగిసిన తరువాత పోలీసులు విడిచిపెట్టగానే అజయ్ తనదారిన తాను బస్సెక్కి ఇంటికి వెళ్లిపోయాడు. బయటకు పోయిన యజమాని మరలా వస్తాడని కుక్క అక్కడే కూచుండిపోయింది. కుక్క అంతటి విశ్వాసం చూపుతుండగా యజమాని అజయ్ అక్కడే వదిలేసి వెళ్లిపోవడం పోలీసులను కూడా బాధించింది. రోజులు గడుస్తున్నా స్టేషన్ ముందే గడుపుతున్న కుక్కను చూసి జాలిపడిన పోలీసులు ప్రతిరోజూ తిండిపెట్టడం ప్రారంభించారు. ఇటీవల ఆ కుక్క అనారోగ్యానికి గురికావడంతో బ్లూక్రాస్ ఆస్పత్రిలో చికిత్స చేయించారు. ఆ తరువాత కూడా పోలీసు స్టేషన్‌కు వచ్చి యజమాని కోసం ఎదురుచూడడం ప్రారంభించడంతో పోలీసులే అక్కున చేర్చుకుని పోషిస్తున్నారు. -
తమిళ దేవుడికి.. ‘తెలుగు తంబిల’ టోపీ
ఎక్కడో తమిళనాడుకు చెందిన దేవుడికి ఓ భక్తుడు ఇచ్చిన భూములవి. విస్తీర్ణం ఒకటీ రెండూ కాదు.. ఏకంగా 26 ఎకరాలు. సుమారు రూ.50 కోట్ల విలువైన ఆ భూములపై రైతుల ముసుగులో ఉన్న ఇద్దరు అధికార పార్టీ నాయకుల కన్ను పడింది. ఇంకేముంది.. దేవుడికే శఠగోపం పెట్టేశారు. వాటిని ఎలాగోలా తమ స్వాధీనంలోకి తెచ్చుకున్నారు. వరిసాగుతో ఒరిగేదేమీ లేదనుకున్నారో ఏమో మరి! ఏకంగా ఆక్వా సాగు ప్రారంభించారు. చెరువులను తిరిగి లీజుకిచ్చేసి రూ.కోట్లలో ఆర్జిస్తున్నారు. అటు ఆలయానికి లీజు.. ఇటు రెవెన్యూకు శిస్తు చెల్లించకుండా.. దేవుడి సొమ్మును దర్జాగా దోచుకుంటూ.. అధికారం అండతో.. ఆ ‘తెలుగు తంబిలు’ సాగిస్తున్న దందా ఇదీ.. పిఠాపురం: తమిళనాడు రాష్ట్రంలోని శ్రీపెరంబు దూర్ అరుణ్ముగు ఆదికేశవ పెరుమాళ్ శ్రీభాస్కరాచార్యస్వామి ఆలయానికి పిఠాపురం రెవెన్యూ పరిధి లోని సర్వే నంబర్ 802–2లో సుమారు 26 ఎకరాల భూములు ఉన్నాయి. మా ర్కెట్ రేటు ప్రకారం ప్రస్తుతం వాటి విలువ సుమారు రూ.50 కోట్లు ఉంది. సుమారు 50 ఏళ్ల కిందట పిఠాపురానికి చెందిన ఒక దాత తనకు వారసులు లేకపోవడంతో.. తమ కులదైవమైన శ్రీపెరంబుదూర్ ఆదికేశవస్వామివారి ఆలయానికి ఈ భూములను విరాళంగా ఇచ్చారు. తమిళనాడు దేవాదాయ శాఖ అధికారులు ఆ భూములను స్థానిక రైతులకు లీజుకు ఇచ్చారు. ఈ భూ ములపై కన్ను వేసిన అధికార టీడీపీకి చెందిన ఇద్దరు వాటిని రెండేళ్ల లీజుకు తీసుకున్నారు. ఇదంతా పదిహేనేళ్ల కిందటి బా గోతం. లీజు కాలం పూర్తయిన తరువాత కూడా పంటలు దెబ్బ తిన్నాయని, నష్టం వచ్చిందని సాకులు చెబుతూ, వాటిని ఖాళీ చేయకుండా, రాజకీయ పలుకుబడితో ఆ భూములపై పెత్తనం సాగిస్తున్నారు. సుమారు 15 ఏళ్లుగా ఎటువంటి లీజూ చెల్లించకుండా, తమ సొం త భూముల మాదిరిగా పంటలు సాగు చేసుకుంటూ కోట్లాది రూపాయల ఆదాయాన్ని దిగమింగుతున్నారని, చివరకు రెవెన్యూకు చిల్లిగవ్వ కూడా భూమి శిస్తు చెల్లించడంలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వారు అధికార టీడీపీకి చెందిన నియోజకవర్గ ముఖ్యనేత అనుచరులు కూడా అయినందువల్లనే అధికారులు మిన్నకుంటున్నారన్న విమర్శలు వస్తున్నాయి. అక్రమ ఆక్వా చెరువులు తమిళ దేవుడికి ఇక్కడ భూములున్న విషయం ఎవ్వరికీ తెలియకపోవడంతో ఇక తమను అడిగేవారే లేరనుకున్న ఆ నేతలు ఏకంగా రొయ్యల చెరువులు తవ్వేశారు. తమిళనాడు దేవాదాయ శాఖ ఎటువంటి లీజుకూ ఇవ్వకపోయినా, ఎవరి అనుమతీ తీసుకోకుండానే ఏకంగా రొయ్యల సాగు చేపట్టారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ భూములను వేలం ద్వారా లీజుకు ఇవ్వాలని తమిళనాడు దేవాదాయ శాఖ ప్రయత్నించింది. అయితే, ఆ భూములు ఖాళీగా లేవని, వాటిల్లో ఆక్వా చెరువులు తవ్వారనే విషయాలు బయటపడ్డాయి. దీంతో అక్కడి అధికారులు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నట్లు తెలుస్తోంది. అయినప్పటికీ సదరు నేతలు అధికారాన్ని అడ్డం పెట్టుకుని యథేచ్ఛగా రొయ్యల సాగు నిర్వహిస్తున్నారు. ఒకపక్క అక్కడ రొయ్యల సాగు చేస్తూనే అధికార పార్టీ ముఖ్య నేత అండతో రెవెన్యూ రికార్డుల్లో మాత్రం పంటభూములుగా చూపిస్తూ పన్ను ఎగవేతకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. రైతుల ఆందోళన పచ్చని పంట పొలాల మధ్య చిచ్చు పెడుతూ రొయ్యల చెరువులు తవ్వుతున్నారని అధికారులకు ఫిర్యాదులు చేసినా ఎవరూ పట్టించుకోలేదని స్థానిక రైతులు ఆరోపిస్తున్నారు. రొయ్యల చెరువుల వల్ల చుట్టుపక్కల ఉన్న సారవంతమైన పంట పొలాలు చౌడుబారి పోతున్నాయని, తీవ్ర నష్టాల పాలవుతున్నామని వారు వాపోతున్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా యథేచ్ఛగా చెరువులు తవ్వేసినా, అధికార పార్టీ నాయకులు కావడంతో అధికారులు పట్టించుకోవడంలేదని, దీంతో తమ పొలాలు నాశనమవుతున్నాయని గగ్గోలు పెడుతున్నారు. న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం ఆ భూములకు సంబంధించి కొన్ని సంవత్సరాలుగా లీజు రావడం లేదు. కొన్నేళ్లుగా శిస్తు చెల్లించడం లేదు. ఇటీవల ఆ భూములను లీజుకు ఇచ్చేందుకు వేలం వేయాలని ప్రయత్నించగా, ఎవరో ఆక్రమించుకుని రొయ్యల చెరువులు తవ్వినట్లు మా దృష్టికి వచ్చింది. దీనిపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు న్యాయస్థానంలో కేసు వేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. పిఠాపురంలో ఒక న్యాయవాది ద్వారా న్యాయపరమైన చర్యలకు ఉపక్రమిస్తున్నాం. – ఎ.నరసింహన్, దేవాదాయ శాఖ అధికారి, అరుణ్ముగు ఆదికేశవ పెరుమాళ్ శ్రీభాస్కరాచార్య స్వామివారి ఆలయం, శ్రీపెరంబుదూర్, తమిళనాడు అవి దేవుడి భూములే, ఆచెరువులు అక్రమ చెరువులే తమిళనాడు దేవస్థానానికి చెందిన భముల్లో ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా రొయ్యల చెరువులు తవ్వినట్లు గుర్తించాము. ఈవిషయాన్ని ఆదేవస్థానం అధికారులకు నోటీసులు పంపించాము. ఆభూముల్లో రొయ్యల చెరువులు ఉండగా రెవిన్యూ రికారుండల్లో పంట భూములుగానే ఉన్నాయి. దీనిపై ప్రభుత్వానికి నివేదికలు పంపించాము. రెవిన్యూ శిస్తు సైతం గత మూడేళ్లుగా చెల్లించడం లేదు. పలుమార్లు నోటీసులు పంపినా సమాధానం లేదు. – బి.సుగుణ, తహసీల్దార్, పిఠాపురం -
'అమ్మ' ఫోన్లు తయారు చేయరూ!
తమిళనాడులో ఇప్పటికే అమ్మ ఉప్పు, అమ్మ నీళ్లు.. ఇలా చాలా ఉన్నాయి. వాటన్నింటికీ తోడు ఇప్పుడు అమ్మ ఫోన్లు తయారుచేయాలని శ్రీపెరుంబుదూర్‌లోని నోకియా ప్లాంటు ఉద్యోగులు కోరుతున్నారు. ఆ ప్లాంటు మూసేసే సమయం దగ్గర పడుతుండటంతో, దాన్ని ప్రభుత్వం టేకోవర్ చేసుకుని, అమ్మ ఫోన్లు రూపొందించాలని కార్మిక సంఘాలు కోరుతున్నాయి. ఈ విషయమై తాము రాష్ట్ర ప్రభుత్వాధికారులను కలిసి ప్లాంటు టేకోవర్ చేసుకోవాల్సిందిగా కోరామని నోకియా ఇండియా కార్మిక సంఘం గౌరవాధ్యక్షుడు, సీపీఎం ఎమ్మెల్యే సౌందరరాజన్ తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కేవలం 700 రూపాయలకే ఫోన్లు తయారు చేయచ్చని, వాటిని చౌకధరల దుకాణాల ద్వారా గానీ, లేదా ఉచితంగా గానీ ఇవ్వచ్చని ఆయన అన్నారు. నవంబర్ ఒకటో తేదీ నుంచి ఈ యూనిట్లో ఫోన్ల ఉత్పత్తి ఆపేస్తున్నట్లు నోకియా ఇంతకుముందే ప్రకటించింది. -
రాజీవ్‌గాంధీ హత్య నేపథ్యంలో శ్రీ పెరంబదూర్
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ మానవబాంబు చేతిలో ఎలా హతమయ్యారో అందరికీ తెలిసిందే. ఆ దారుణ మారణకాండను, ఆ హత్య వెనుక జరిగిన మహా పన్నాగాలను చాలా రియలస్టిక్‌గా మలయాళంలో తెరకెక్కించారు. మమ్ముట్టి కథానాయకునిగా చేసిన ఆ చిత్రానికి ఫేమస్ డెరైక్టర్ మేజర్ రవి దర్శకత్వం వహించారు. ఇప్పుడీ చిత్రం తెలుగులో ‘శ్రీ పెరంబదూర్’ పేరుతో అనువాదమవుతోంది. షేక్ మహమ్మద్ (హుస్సేన్) ఈ సినిమాను కొన్ని మార్పులూ చేర్పులతో తెలుగు ప్రేక్షకులకు అందించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం అనువాద కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇటీవలే తెలుగు వెర్షన్ కోసం కొంత రీ షూట్ కూడా చేశారు. రాజకీయాల్ని ఇష్టపడేవారు కాకుండా, సామాన్య ప్రేక్షకులకూ నచ్చేవిధంగా ఈ చిత్రం ఉంటుందని, నవంబరులో సినిమాను విడుదల చేస్తామని హుస్సేన్ తెలిపారు. శ్రీ తిరుమల హోమ్ ట్రేడర్స్ పతాకంపై అనువాదమవుతోన్న ఈ చిత్రానికి సమర్పణ: తేలప్రోలు వీరయ్య చౌదరి. -
చోరీకి గురైన రూ.4 కోట్ల బంగారు నగలు స్వాధీనం
పళ్లిపట్టు, న్యూస్‌లైన్ : శ్రీపెరంబుదూరు సమీపాన వ్యానులో చోరీకి గురైన నాలుగు కోట్ల రూపాయలు విలువచేసే బంగారు నగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో కీలక నిందితులను అరెస్టు చేశారు. హోసూరు దర్గా ప్రాంతంలో బంగారు నగలు తయారు చేసే వర్క్‌షాపు ఉంది. ఇక్కడ తయారైన నగలను వర్క్‌షాప్ ఉద్యోగి రాజేంద్రన్, రిటైర్డ్ సైనిక అధికారి సుబ్రమణి సోమవారం చెన్నైలోని బంగారు దుకాణాలకు అందజేసేందుకు వ్యానులో తీసుకుని వస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు వ్యానును అపహరించి నాలుగు కోట్ల విలువైన నగలు చోరి చేసిన విషయం తెలిసిందే. వ్యానును వెంబడించిన కారులోని వ్యక్తులు ఈ చోరీకి పాల్పడినట్లు టోల్గేట్ కెమెరాల్లో చిత్రాలు నమోదయ్యాయి. వీటి ఆధారంగా పోలీసులు విచారణ జరిపారు.డ ీఐజీ సత్యమూర్తి, జిల్లా ఎస్పీ విజయకుమార్ నేతృత్వంలోని ఆరు ప్రత్యేక పోలీసుల బృందాలు నిందితుల కోసం గాలించాయి. పోలీసులు వ్యాను డ్రైవర్ సతీష్‌ను అనుమానించి అతనిని అదుపులోనికి తీసుకున్నారు. అతనిని విచారించగా పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూశాయి. సతీష్ కుమారుడు పాత నేరస్తుడు. ఒక కేసులో అరెస్టయి వేలూరు జైలులో గడిపాడు. కొద్ది నెలల క్రితం బయటికి వచ్చాడు. నాలుగు కోట్ల నగలను తీసుకువెళుతున్న విషయాన్ని సతీష్ తన మిత్రులకు తెలిపాడు. వారు వ్యానులోని నగలను చోరీ చేసి హోసూరులో దాచినట్లు తెలిసింది. డ్రైవర్ సతీష్ ఇచ్చిన సమాచారం మేరకు హోసూరుకు చెందిన మురుగన్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. చోరీ చేసిన బంగారు ఆభరణాలను హోసూరుకు చెందిన నాగరాజు ఇంట్లో దాచినట్టు మురుగన్ తెలిపాడు. దీంతో పోలీసులు నాగరాజు ఇంటిలోని ట్యాంక్ పక్కన ఉంచిన నగలను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో వున్న నిందితులను కోసం పోలీసులు గాలిస్తున్నారు.