తమిళనాడులో ఇప్పటికే అమ్మ ఉప్పు, అమ్మ నీళ్లు.. ఇలా చాలా ఉన్నాయి. వాటన్నింటికీ తోడు ఇప్పుడు అమ్మ ఫోన్లు తయారుచేయాలని శ్రీపెరుంబుదూర్లోని నోకియా ప్లాంటు ఉద్యోగులు కోరుతున్నారు. ఆ ప్లాంటు మూసేసే సమయం దగ్గర పడుతుండటంతో, దాన్ని ప్రభుత్వం టేకోవర్ చేసుకుని, అమ్మ ఫోన్లు రూపొందించాలని కార్మిక సంఘాలు కోరుతున్నాయి.
ఈ విషయమై తాము రాష్ట్ర ప్రభుత్వాధికారులను కలిసి ప్లాంటు టేకోవర్ చేసుకోవాల్సిందిగా కోరామని నోకియా ఇండియా కార్మిక సంఘం గౌరవాధ్యక్షుడు, సీపీఎం ఎమ్మెల్యే సౌందరరాజన్ తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కేవలం 700 రూపాయలకే ఫోన్లు తయారు చేయచ్చని, వాటిని చౌకధరల దుకాణాల ద్వారా గానీ, లేదా ఉచితంగా గానీ ఇవ్వచ్చని ఆయన అన్నారు. నవంబర్ ఒకటో తేదీ నుంచి ఈ యూనిట్లో ఫోన్ల ఉత్పత్తి ఆపేస్తున్నట్లు నోకియా ఇంతకుముందే ప్రకటించింది.
'అమ్మ' ఫోన్లు తయారు చేయరూ!
Published Tue, Oct 21 2014 4:20 PM | Last Updated on Sat, Sep 2 2017 3:13 PM
Advertisement