
ఆయుష్మాన్ ఖురానా
బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా ఎంపిక చేసుకునే కథలు విభిన్నంగా ఉంటాయి. విచిత్రంగానూ ఉంటాయి. ‘విక్కీ డోనర్’లో వీర్యం దానం చేశారు. ‘అంధాధూన్’లో గుడ్డి పియానో ప్లేయర్‌గా అందర్నీ మోసం చేశారు. తాజాగా మరో ఆసక్తికర కథను ఎంపిక చేసుకున్నారు. హీరోయిన్‌తో రొమాన్స్ చేయకుండా మరో అబ్బాయితో రొమాన్స్ చేస్తారట. ఇదో గే లవ్‌స్టోరీ అని సమాచారం. ఆయుష్మాన్ సూపర్ హిట్ చిత్రం ‘శుభమంగళ్ సావధాన్’కి సీక్వెల్‌గా ‘శుభమంగళ్ జ్యాదా సావధాన్’ ప్రకటించారు. మొదటి భాగంలో శృంగార సమస్యలను చాలా సరదాగా చూపించారు. కొత్త సినిమాలో హోమోసెక్సువాలిటీను (స్వలింగ సంపర్కం) డిస్కస్ చేయబోతున్నారట. దర్శకుడు ఆనంద్ ఎల్. రాయ్ నిర్మాణంలో ఈ చిత్రాన్ని హితేశ్ కేవాల్య దర్శకత్వం వహిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment