6000 స్క్రీన్స్పై బాహుబలి రిలీజ్
బాహుబలి సినిమా రిలీజ్ అయి 8 నెలలు గడుస్తున్నా ఇప్పటికీ ఆ సినిమా హవా కనిపిస్తూనే ఉంది. 2015 జూలైలో రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పటికీ తన సంచలనాలను నమోదు చేస్తూనే ఉంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 600 కోట్ల వరకు వసూలు చేసిన బాహుబలి.. ఇప్పుడు మరోసారి భారీ రిలీజ్కు రెడీ అవుతోంది. తెలుగు, తమిళ్, మళయాలం, హిందీతో పాటు ఇతర దేశభాషల్లో కూడా రిలీజ్ అయిన బాహుబలి ఇప్పుడు ఏకంగా 6000 స్క్రీన్స్ మీద రిలీజ్కు రెడీ అవుతోంది.
వినోద రంగానికి భారీ మార్కెట్ ఉన్న చైనాలో బాహుబలి సినిమాను భారీగా రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు చిత్రయూనిట్. పికె సినిమాను చైనాలో రిలీజ్ చేసిన ఇ స్టార్ ఫిలింస్ సంస్థతో కలిసి బాహుబలి రిలీజ్కు ప్లాన్ చేస్తున్నారు. అంతేకాదు పికె సినిమాను 5000 స్క్రీన్స్ మీద రిలీజ్ చేసిన ఈ సంస్ధ బాహుబలి సినిమాను 6000 స్క్రీన్స్ మీద రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తోంది. దీంతో కలెక్షన్ల విషయంలో బాహుబలి మరో రికార్డ్ సెట్ చేయటం ఖాయం అంటున్నారు ట్రేడ్ పండితులు.
ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రానా, రమ్యకృష్ణ, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రలలో తెరకెక్కిన బాహుబలి సంచలన విజయం సాధించింది. ప్రస్తుతం రెండో భాగం చిత్రీకరణ జరుపుకుంటోంది. మరింత భారీగా ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న బాహుబలి 2ని ఈ ఏడాది చివర్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.